Asianet News TeluguAsianet News Telugu

ఆగస్ట్ లో థియోటర్స్ రీఓపెన్,ఈ సినిమాలతోనే...

ఆగిపోయిన షూటింగ్ లు పునః ప్రారంభం అవుతున్నాయి. అయితే అనుకున్నంత వేగంగా థియేటర్స్ రీఓపెన్ అయ్యేటట్లు కనపడటం లేదు.  ప్రభుత్వం ఫర్మిషన్ ఇచ్చినా ఎంతమంది థియేటర్స్  కు ధైర్యంగా వస్తారో తెలియని పరిస్దితి. 

Tollywood aims August Theatrical Releases jsp
Author
Hyderabad, First Published Jun 16, 2021, 10:32 AM IST

వరుసగా రెండో సంవత్సరం కూడా సినీ  పరిశ్రమ సమ్మర్ ని కోల్పోపోయింది. కరోనా సెకండ్ వేవ్  ఇంపాక్ట్ట్ దారుణంగా ఉండటంతో  అంతటా స్తబ్దత కనిపించింది. మొత్తానికి రెండో దశ కరోనా తగ్గుముఖం పట్టడంతో సినీ పరిశ్రమలో పనులు ఊపందుకున్నాయి. ఆగిపోయిన షూటింగ్ లు పునః ప్రారంభం అవుతున్నాయి. అయితే అనుకున్నంత వేగంగా థియేటర్స్ రీఓపెన్ అయ్యేటట్లు కనపడటం లేదు.  ప్రభుత్వం ఫర్మిషన్ ఇచ్చినా ఎంతమంది థియేటర్స్  కు ధైర్యంగా వస్తారో తెలియని పరిస్దితి. 

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూలై చివర నుంచి 50శాతం ఆక్యుపెన్సితో థియోటర్స్ రీఓపెన్ అవుతాయి.దాంతో ఆగస్టు నుంచి వరసపెట్టి ఆగిన సినిమాలు అన్ని రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వాటిలో మొదట లవ్ స్టోరీ,టక్ జగదీష్, విరాట పర్వం, సీటీమార్ చిత్రాలు ఉన్నాయి. ఈ మేరకు డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే ఏదీ ఫైనలైజ్  కాలేదు. ఇక నారప్ప,, పాగల్,  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వంటి సినిమాలు షూటింగ్  పూర్తి చేసుకుని రిలీజ్ కు ఎదురుచూస్తున్నాయి. రాథేశ్యామ్, ఆచార్య సినిమాలు షూటింగ్ ఆఖరి స్టేజీలో ఉన్నాయి. ఏదైమైనా అన్నీ కలిసొస్తే ఆగస్ట్,సెప్టెంబర్ లలో వరస పెట్టి రిలీజ్ లు ఉంటాయి.

షూటింగ్ ల విషయానికి వస్తే...ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ 10 రోజులు షూటింగ్ చేస్తే పూర్తవుతుంది. వచ్చే నెల ఆరంభంలో ఆ సినిమా తిరిగి ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప’ కొత్త షెడ్యూల్‌ వచ్చే నెల మొదటి వారం నుంచి ప్రారంభం కానుందట. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’, ‘ఆచార్య’ చిత్రాలు లాస్ట స్టేజికు చేరుకున్నాయి. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ నటిస్తున్న ‘ఎఫ్‌3’ కోసం కూడా రంగం సిద్ధమైనట్టు సమాచారం. జులైలో సినిమాలన్నీ  పట్టాలెక్కే అవకాశాలున్నాయి. షూటింగ్ లు పూర్తవ్వటాన్ని బట్టి విడుదల తేదీలపై ఆయా చిత్ర టీమ్ లు ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. ఆగస్టు తర్వాతే స్టార్ హీరోల చిత్రాలు విడుదల తేదీల్ని ఖరారు చేయనున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios