‘కొండా’ మూవీ హీరో త్రిగన్ (Thrigun) అలియాస్ ఆదిత్ అరుణ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. రేపే ఆయన పెళ్లి వేడక జరగనుంది. ఈ సందర్బంగా కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.  

టాలీవుడ్ యంగ్ హీరో త్రిగన్ (ఆదిత్ అరుణ్) తెలుగు చిత్ర పరిశ్రమలో పద్నాలుగేళ్లుగా యాక్టివ్ గా ఉన్నారు. 2009లో వచ్చిన ‘కథ’ అనే చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి వరుస సినిమాలతో అలరిస్తూ వస్తున్నారు. అటు తమిళంలోనూ కొన్ని సినిమాలు చేశారు. తెలుగు ఈయన... వీకెండ్ లవ్, తుంగభద్ర, మనసుకు నచ్చింది, 24 కిస్సెస్, డియర్ మేఘా, WWW వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. గతేడాది ‘కథ కంచికి మనం ఇంటికి’, సెన్సేషన్ డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన ‘కొండా’ చిత్రాలతో అలరించారు. అలాగే వెబ్ సిరీస్ 11th Hour లోనూ నటించి మెప్పించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయితే, టాలీవుడ్ లో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నివేదితా అనే అమ్మాయితో త్రిగన్ వివాహం గ్రాండ్ గా జరగనుంది. వీరి పెళ్లి రేపు (సెప్టెంబర్ 3న) జరగనుండగా.. పలువురు శుభకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరుల ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకుంటున్నారు.