ఆ వ్యక్తి పదేపదే కాల్స్, మెసేజెస్ తో రామకృష్ణను ఇబ్బంది పెట్టడంతో అతని నంబర్ ని బ్లాక్ చేశాడు. అయినా ఆ వ్యక్తి వేరే నంబర్స్ నుంచి కాల్స్, మెసేజెస్ చేస్తూ ....
సింగర్ సునీత భర్త వీరపనేని రామకృష్ణను ఓ వ్యక్తి బెదిరించటం మొదలు పెట్టాడు. దీంతో ఆయన బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు వీరపనేని రామకృష్ణకు బెదిరించిన వ్యక్తి ఎవరు ? ఎందుకు బెదిరించాల్సి వచ్చింది? వివరాల్లోకి వెళితే..
ప్రముఖ సింగర్ సునీత కొన్నేళ్ల క్రితం సినీ పరిశ్రమలోనే రామకృష్ణ వీరపనేని అనే ఓ ప్రముఖ వ్యాపారవేత్తని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రామ్ కు డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ, ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. రీసెంట్ గా సునీత భర్త రామకృష్ణను ఓ వ్యక్తి బెదిరింపులకు గురిచేయడంతో ఆయన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు,మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. సినిమా నిర్మాతల కౌన్సిల్ సభ్యుడిని అంటూ KK లక్ష్మణ్ అనే వ్యక్తి వీరపనేని రామకృష్ణకు మెసేజ్, కాల్స్ చేసి వ్యక్తిగతంగా కలవాలని కోరాడు. అపరిచిత వ్యక్తి కావడంతో రామకృష్ణ నో చెప్పి, ఏదైనా బిజినెస్ వ్యవహారం అయితే తన టీంని కలవాలని కోరాడు. అయినా ఆ వ్యక్తి పదేపదే కాల్స్, మెసేజెస్ తో రామకృష్ణను ఇబ్బంది పెట్టడంతో అతని నంబర్ ని బ్లాక్ చేశాడు. అయినా ఆ వ్యక్తి వేరే నంబర్స్ నుంచి కాల్స్, మెసేజెస్ చేస్తూ బెదిరింపులకు పాల్పడటంతో రామకృష్ణ బంజారాహిల్స్ పోలీసులను సంప్రదించి అతనిపై ఫిర్యాదు చేశారు.
బంజారాహిల్స్ పోలీసులు KK లక్ష్మణ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. రామకృష్ణ తన వద్ద ఉన్న ఫోన్ కాల్స్ లిస్ట్, మెసేజ్ లు పోలీసులకు ఇచ్చారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.
