Asianet News TeluguAsianet News Telugu

యానిమల్ సక్సెస్ అందుకే ఆస్వాదించలేకపోయా... రష్మిక మందాన ఆసక్తికర వ్యాఖ్యలు

స్టార్ లేడీ రష్మిక మందాన యానిమల్ సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోయారట. ఆమె ఇంటర్వ్యూలలో పాల్గొనకపోవడానికి కారణం ఉందట. ఈ మేరకు ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. 
 

this why i am not enjoyed animal success says rashmika mandanna ksr
Author
First Published Feb 26, 2024, 11:33 AM IST | Last Updated Feb 26, 2024, 11:33 AM IST

రష్మిక మందాన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా ఉంది యానిమల్. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ చిత్రంలో రన్బీర్ కపూర్ వైలెంట్ రోల్ చేశాడు. ఆయనకు జంటగా రష్మిక మందాన నటించింది. యానిమల్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రన్బీర్ కపూర్ కెరీర్ హైయెస్ట్ నమోదు అయ్యాయి. అయితే యానిమల్ సక్సెస్ మీట్స్, ఇంటర్వ్యూల్లో రష్మిక మందాన పెద్దగా కనిపించలేదు. అందుకు కారణం ఏమిటో తాజాగా వెల్లడించింది. 

యానిమల్ విడుదల తర్వాత నేను షూటింగ్ లో బిజీ అయ్యాను. ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ సెట్స్ పై ఉన్నాయి. వాటి షూటింగ్ కోసం నేను రాత్రిళ్ళు ప్రయాణం చేయాల్సి వచ్చింది. అందుకే యానిమల్ సక్సెస్ కి సంబంధించిన ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ లో నేను పాల్గొనలేకపోయాను. నాకు కూడా యానిమల్ సక్సెస్ ని ఆస్వాదించాలని అనిపించింది. కానీ కుదర్లేదు. 

నాపై ప్రేమాభిమానాలతో మీరు ఆందోళన చెందారు. నాకు అర్థం అవుతుంది. అప్ కమింగ్ చిత్రాలతో ఆ లోటు తీరుస్తాను... అని రష్మిక మందాన చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక... పుష్ప 2లో నటిస్తుంది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇది పుష్ప చిత్రానికి సీక్వెల్. అలాగే గర్ల్ ఫ్రెండ్, రైన్ బో టైటిల్స్ తో రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios