Asianet News TeluguAsianet News Telugu

అప్పుడు వాళ్ళు ఇప్పుడు తారక్.. అఖిల్ తిప్పలేంటో?

వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న అక్కినేని సెకండ్ వారసుడు అఖిల్ ఈసారి మళ్ళీ  రొటీన్ గానే వస్తున్నాడు. మిస్టర్ మజ్ను అంటూ హిట్టు కొట్టడానికి సన్నద్ధమవుతున్న ఈ వారసుడికి నందమూరి హీరో నుంచి సపోర్ట్ తీసుకోనున్నాడు. 

this time jr ntr for akhil
Author
Hyderabad, First Published Jan 17, 2019, 4:44 PM IST

వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న అక్కినేని సెకండ్ వారసుడు అఖిల్ ఈసారి మళ్ళీ  రొటీన్ గానే వస్తున్నాడు. మిస్టర్ మజ్ను అంటూ హిట్టు కొట్టడానికి సన్నద్ధమవుతున్న ఈ వారసుడికి నందమూరి హీరో నుంచి సపోర్ట్ తీసుకోనున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కినక్ mr.మజ్ను ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 19న నిర్వహించనున్నారు. 

అయితే వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిధిగా రాబోతున్నాడు. మొదటి నుంచి అఖిల్ స్టార్ హీరోల హెల్ప్ తీసుకుంటున్నాడు. మొదట్లో మహేష్ ని అఖిల్ సినిమాకు పిలువగా ఆ తరువాత హలో సినిమాకు మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ తీసుకున్నాడు. ప్రతిసారి స్టార్ హీరోల నుంచి ప్రమోషన్స్ చేస్తోన్న అఖిల్ హిట్ మాత్రం అందుకోవడం లేదు. 

ఇక ఘట్టమనేని - మెగా ఫ్యాన్స్ తో పాటు ఇప్పుడు నందమూరి అభిమానులను టార్గెట్ చేశాడు. తారక్ వస్తే సినిమాకు క్రేజ్ పెరగవచ్చు గాని సినిమా బావుంటేనే హిట్టవుతుందని అఖిల్ తెలుసుకుంటే బెటర్ అంటున్నారు నెటిజన్స్. సినిమా సాంగ్స్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. మరి మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ కి తారక్ రాకతో మనోడి ఫెట్ ఎంతవరకు చేంజ్ అవుతుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios