Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవితో నెక్స్ట్ డే షూటింగ్... రాత్రంతా నిద్రలేదన్న స్టార్ హీరోయిన్! మేటర్ ఏంటంటే? 


ఓ స్టార్ హీరోయిన్ కి చిరంజీవి చుక్కలు చూపించాడట. ఆయనతో నెక్స్ట్ డే షూట్ ఉండగా ఆ రోజు రాత్రి సదరు హీరోయిన్ కి భయంతో నిద్ర కరువైందట. ఇంతకీ మేటర్ ఏంటంటే?
 

this star heroine had sleepless night because of chiranjeevi ksr
Author
First Published Aug 21, 2024, 6:10 PM IST | Last Updated Aug 21, 2024, 6:10 PM IST

మెగాస్టార్ చిరంజీవి ఎవర్ గ్రీన్ హీరో. ఏడు పదుల వయసు దగ్గరపడుతున్నా యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. గత రెండేళ్లలో చిరంజీవి నాలుగు సినిమాలు విడుదల చేశాడు. ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ నెలల వ్యవధిలో విడుదలయ్యాయి. ఆయన వాయు వేగంతో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ యాభై శాతానికి పైగా పూర్తి అయ్యింది. 

విశ్వంభర సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతుంది. చిరంజీవి జంటగా త్రిష నటిస్తుంది. చిరంజీవి పలు లోకాల్లో సంచరించే జగదేక వీరుడిగా కనిపిస్తాడట. విశ్వంభరలో చిరంజీవి లుక్ ఆకట్టుకుంటుంది. బింబిసార ఫేమ్ వశిష్ట విశ్వంభర చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. విశ్వంభర చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుందని సమాచారం. ఆగస్టు 22న చిరంజీవి జన్మదినం నేపథ్యంలో విశ్వంభర మూవీ అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 

చిరంజీవి ఫ్యాన్స్ కోసం ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్ర రీ రిలీజ్ చేస్తున్నారు. 2002లో విడుదలైన ఇంద్ర ఇండస్ట్రీ హిట్. పలు టాలీవుడ్ రికార్డ్స్ ని ఈ చిత్రం బ్రేక్ చేసింది. దర్శకుడు బీ గోపాల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్, సోనాలీ బింద్రే హీరోయిన్స్ గా నటించారు. మణిశర్మ సాంగ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇంద్ర మూవీ రీరిలీజ్ నేపథ్యంలో సోనాలి బింద్రే ఆ మూవీ సంగతులు గుర్తు చేసుకున్నారు. 

నెక్స్ట్ డే చిరంజీవితో సాంగ్ షూటింగ్ ఉందట. ఆయన పక్కన డాన్స్ చేయగలనా లేదా అని సోనాలీ బింద్రే కి ఆ రోజు రాత్రి నిద్ర కూడా పట్టలేదట. 'దాయి దాయి దామ్మా...' పాటలో చిరంజీవి వీణ స్టెప్ వేస్తుంటూ చూసి మెస్మరైజ్ అయిపోయిందట. ఆ స్టెప్ నా వల్ల అయితే కాదని సోనాలీ బింద్రే చెప్పుకొచ్చింది. అలాగే 'కృష్ణ ముకుందా...' సాంగ్ సైతం ఆమె బాగా ఎంజాయ్ చేశారట. హైదరాబాద్ లో ఓ భారీ సెట్ లో ఆ పాట షూటింగ్ జరిగిందట. షూటింగ్ సెట్స్ కి చిరంజీవి పిల్లలు, నిర్మాత అశ్వినీ దత్ పిల్లలు వచ్చారట. 

ఇంద్ర సినిమా టీవీలో ప్రసారం అయితే చాలా బాగా చేశావని సోనాలీ బింద్రేకు సన్నిహితులు ఇప్పటికీ కాల్స్ చేస్తారట. ఇంద్ర సినిమాను థియేటర్స్ లో మరోసారి చూసి ఎంజాయ్ చేయడం గొప్ప పరిణామం. బ్లాక్ బస్టర్ సినిమాను సెలెబ్రేట్ చేసుకున్నట్లు అవుతుందని ఆమె అన్నారు. సోనాలీ బింద్రే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరోవైపు చిరంజీవి జన్మదిన వేడుకలకు అభిమానులు సిద్ధం అవుతున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios