Asianet News TeluguAsianet News Telugu

బింబిసార, సీతారామం ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు.... వీరిద్దరి టార్గెట్స్ ఎంతంటే?

రేపు బాక్సాఫీస్ వద్ద రెండు చిత్రాలు పోటీపడనున్నాయి. దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం, కళ్యాణ్ రామ్ బింబిసార విడుదల కానున్నాయి. మరి ఈ రెండు చిత్రాల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో చూద్దాం... 
 

this is the break even target for sitaramam and bimbisara movies
Author
Hyderabad, First Published Aug 4, 2022, 2:11 PM IST


జులై నెల టాలీవుడ్ కి చుక్కలు చూపించింది. ఈ నెలలో విడుదలైన ఒక్క చిత్రం కూడా విజయం సాధించలేదు. పక్కా కమర్షియల్, ది వారియర్, థాంక్యూ, రామారావు ఆన్ డ్యూటీ డిజాస్టర్స్ గా మిలిగిలాయి. ఒక్క మూవీ కూడా కనీస వసూళ్లు రాబట్టలేదు. ఈ చిత్రాలను కొన్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోయారు. దీంతో ఈ వారం విడుదల కానున్న చిత్రాలపై టాలీవుడ్ ఆశలు పెట్టుకుంది. ఆగస్టు 5న బింబిసార, సీతారామ విడుదలవుతున్నాయి. ఈ రెండు చిత్రాలపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. 

ట్రైలర్స్, ప్రోమోలు ఆకట్టుకోగా మూవీ సక్సెస్ పై టీమ్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. దుల్కర్ సల్మాన్, రష్మిక మందాన వంటి స్టార్ కాస్ట్ తో దర్శకుడు హను రాఘవపూడి సీతారామం తెరకెక్కించారు. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా సీతారామం తెరకెక్కింది. ఇక సోసియో ఫాంటసీ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ హీరోగా దర్శకుడు వశిష్ట్ బింబిసార(Bimbisara) తెరకెక్కించారు. ఇక ఈ రెండు చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే... సీతారామం వరల్డ్ రూ. 17 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. 

నైజాం హక్కులు రూ. 4 కోట్లకు ఆంధ్రా, సీడెడ్ హక్కులు 7.5 కోట్లకు విక్రయించారట ఇక ఓవర్సీస్ హక్కులు రూ.2.5 కోట్లు పలికాయట. కాబట్టి సీతారామం(Sitaramam) బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 18 కోట్లుగా ఉంది. మరో వైపు బింబిసార వరల్డ్ వైడ్ రూ.16.5 కోట్లకు అమ్మారట. అనూహ్యంగా సీతారామం కంటే తక్కువ ధరకు బింబిసార హక్కులు అమ్మడుపోయాయి. కళ్యాణ్ రామ్ గత చిత్రాల మార్కెట్ దృష్ట్యా పాజిటివ్ బజ్ ఏర్పడినప్పటికీ అంతగా ధర పలకలేదు. కాబట్టి బింబిసార బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 నుండి 18 కోట్లుగా చెప్పవచ్చు. వరుస నష్టాలతో ఇబ్బందిపడుతున్న టాలీవుడ్ కి ఈ రెండు చిత్రాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూడాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios