Asianet News TeluguAsianet News Telugu

‘ది ఘోస్ట్’ రిలీజ్ ట్రైలర్ విడుదల.. సాలిడ్ యాక్షన్ చూపించబోతున్న నాగార్జున.!

కింగ్, అక్కినేని నాగార్జున తాజాగా నటించిన చిత్రం ‘ది ఘోస్ట్’ (The Ghost). నాలుగు రోజుల్లో థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే సినిమాపై హైప్ క్రియేట్ అవ్వగా.. తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ తో అంచనాలు మరింతగా పెరిగాయి. 
 

The Ghost Movie release trailer released, Nagarjuna is going to show solid action!
Author
First Published Sep 30, 2022, 5:58 PM IST

సీనియర్ హీరో, అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) వరస పెట్టి  చిత్రాల్లో నటిస్తున్నారు. చివరిగా ‘బంగార్రాజు’,‘బ్రహ్మస్త్ర’తో మాసీవ్ సక్సెస్ ను అందుకున్నాడు. అటు ఫ్యామిలీ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు యాక్షన్ ఫిల్మ్స్ తోనూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ది ఘోస్ట్’తో  నాగార్జున ప్రేక్షకుల  ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం మరో ఐదు రోజుల్లో థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్  జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

తాజాగా చిత్రం రిలీజ్ సందర్భంగా ‘రిలీజ్ ట్రైలర్’(Release Trailer)ను  విడుదల చేశారు. గతంలో విడుదలైన ట్రైలర్, టీజర్ కన్నా రిలీజ్ ట్రైలర్ మరింతగా ఆకట్టుకుంటోంది. ఆరు పదుల వయస్సులోనూ నాగార్జున అదిరిపోయే యాక్షన్స్ సీన్స్, పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్నారు. సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ , ఎమోషనల్ సీన్స్ తో రిలీజ్ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన  అప్డేట్స్ భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. దీంతో అభిమానులు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. 

దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ‘ది ఘోస్ట్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  పవర్ ఫుల్ రా ఏజెంట్ పాత్రలో నాగార్జున నటించారు.  మూవీలోని యాక్షన్ సీన్స్ కోసం నాగ్ మరింత కష్టపడ్డారు. చిత్రంలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) నాగార్జున సరసన  నటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమా అక్టోబరు 5న దరసరా సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' కూడా అదే రోజు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. 

 

Follow Us:
Download App:
  • android
  • ios