వివాదాల సంగతి ఎలా ఉన్నా సమంత ఇమేజ్ దేశవ్యాప్తం చేసింది ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్. తమన్నా లీడ్ రోల్ లో తెరకెక్కిన ఈ సిరీస్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. లేడీ టెర్రరిస్ట్ గా సమంత ఇరగదీశారు. ఓ ఛాలెంజింగ్ పాత్రకు తమన్నా వంద శాతం న్యాయం చేశారన్న మాట వినిపిస్తుంది. 


ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ సక్సెస్ నేపథ్యంలో సమంతతో మరిన్ని వెబ్ సిరీస్ లు తెరకెక్కించే యోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ఫ్లిక్స్  సమంతతో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారట. ఈమేరకు ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ పరిశ్రమలో ప్రముఖంగా వినిపిస్తుంది. 

ప్రస్తుతం సమంత దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం మూవీలో నటిస్తున్నారు. మైథలాజికల్ కాన్సెప్ట్ తో భారీ పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీ కోసం భారీ సెట్స్ నిర్మించడం జరిగింది. కరోనా నేపథ్యంలో శాకుంతలం మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది. కాగా శాకుంతలం మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్టీఆర్ లేదా బన్నీ కుమారులలో ఒకరు నటిస్తున్నారంటూ వార్తలు రావడం కొసమెరుపు.