కాపీ చేసి భలే దొరికిపోయావ్ థమన్ అంటూ... ఆడుకుంటున్న నెటిజెన్స్
రవితేజ-శృతి హాసన్ జంటగా దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ మూవీ తెరకెక్కుతుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుండి 'బల్లేగా దొరికావే బంగారం' సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ ట్యూన్ ని ఓ లాటిన్ మూవీ నుండి థమన్ కాపీ చేసినట్లు నెటిజెన్స్ ఆరోపిస్తున్నారు.
Hyderabad, First Published Dec 16, 2020, 4:36 PM IST | Last Updated Dec 16, 2020, 4:36 PM IST
బాలీవుడ్, హాలీవుడ్ నుండి ట్యూన్స్ కొట్టేసే సాంప్రదాయం టాలీవుడ్ లో ఎప్పటి నుండో ఉంది. కొందరు మ్యూజిక్ డైరెక్టర్స్ తెలివిగా వేరే ట్యూన్స్ మన నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి వడ్డించేస్తారు. అందరూ ఎదో ఒక రూపంలో చౌర్య కళ చూపించినవారే. అయితే థమన్ ఈ విషయంలో కొంచెం ఎక్కువ అనే టాక్ ఉంది. అలాగే కాపీ ట్యూన్స్ చేసి దొరికిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా మరోమారు థమన్ కంపోజ్ చేసిన సాంగ్ కాపీ వివాదంలో చిక్కుకుంది.
రవితేజ-శృతి హాసన్ జంటగా దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ మూవీ తెరకెక్కుతుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుండి 'బల్లేగా దొరికావే బంగారం' సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ ట్యూన్ ని ఓ లాటిన్ మూవీ నుండి థమన్ కాపీ చేసినట్లు నెటిజెన్స్ ఆరోపిస్తున్నారు. లాటిన్ సాంగ్ ట్యూన్ కొట్టేస్తే మేము కనిపెట్టలేమా అంటూ థమన్ ని భారీగా ట్రోల్ చేస్తున్నారు. ట్విట్టర్ లో థమన్ యాష్ ట్యాగ్ కొడితే వరుసగా అనేక ట్రోల్స్ దర్శనం ఇస్తున్నాయి.
సోషల్ మీడియా యుగంలో ప్రతి విషయంపై అవగాహన ఉంటున్న నెటిజెన్స్ ...ఎక్కడ నుండి కాపీ చేసినా వెంటనే కనిపెట్టేస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్ నుండి ఇటీవల ఎన్టీఆర్ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లోని కొన్ని షాట్స్ రాజమౌళి వేరే చోట నుండి గ్రహించిన విషయాన్ని నెటిజెన్స్ ట్రోల్ చేయడం జరిగింది.