బేరం తెగింది , #LEO తెలుగు రైట్స్ రేటు తగ్గించి రీ ఎగ్రిమెంట్
దాదాపు 18 కోట్లతో ఈ మూవీ రైట్స్ ని దక్కించుకున్నట్లు తెలుస్తుంది. విజయ్ మూవీస్ తెలుగు రైట్స్ సేల్స్ ఇదే హైయెస్ట్. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.
దళపతి విజయ్ ,సెన్సేషన్ డైరక్టర్ లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘లియో’. ఈ మూవీ పై తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు లోకేష్ రీసెంట్ గా విక్రమ్ తో బ్లాక్ బస్టర్ అందుకోవడం, అంతకముందు విజయ్ తో మాస్టర్ వంటి సూపర్ హిట్ మూవీ తెరకెక్కించడం, ఆ రెండు చిత్రాలు తెలుగు ఆడియన్స్ ని కూడా విపరీతంగా అలరించడంతో లియో పై రెండు తెలుగు రాష్ట్రాల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. దీంతో సితార ఎంటర్టైన్మెంట్స్ వారు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టడానికి లియో సినిమా పర్ఫెక్ట్ అని భావించి ఆ మూవీ తెలుగు రైట్స్ ని సొంతం చేసుకున్నారు.
దాదాపు 18 కోట్లతో ఈ మూవీ రైట్స్ ని దక్కించుకున్నట్లు తెలుస్తుంది. విజయ్ మూవీస్ తెలుగు రైట్స్ సేల్స్ ఇదే హైయెస్ట్. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో అంటే అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతోంది. ఈ నేపధ్యంలో ట్రైలర్ తర్వాత క్రేజ్ పెరగలేదని, తెలుగులో రెండు భారీ సినిమాలు పోటీ పడుతున్నాయని, సితార బ్యానర్ అధినేత నాగ వంశీ నెగోషియోషన్ కు దిగినట్లు సమాచారం. దాంతో మొదట ఒప్పుకోకపోయినా చివరకు రెండు కోట్లు తగ్గించి 16 కోట్లకు తిరిగి రీ ఎగ్రిమెంట్ చేసారని సమాచారం. అంటే తెలుగు రైట్స్ 16 కోట్లుగా ఫిక్స్ చేసారన్నమాట.
కమల్ హాసన్‌తో 'విక్రమ్' లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం వల్ల సినిమా భారీ రేంజ్లో హైప్ ఉంది. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఈ సారి కాస్త ఎక్కువగా ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నారు లోకేష్ కనగరాజ్ తమిళనాట తెగ ఇంటర్వూస్ ఇస్తున్నాడు. తెలుగు, తమిళంలో భారీ క్రేజ్ కనపడుతోంది. లియోకు అద్భుతమైన థియేట్రికల్ అలాగే నాన్-థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
లియో తమిళ నిర్మాత లలిత్ కుమార్...హాలీవుడ్ చిత్రం ‘A History of Violence’ రైట్స్ ని బారీ రేటుకు తీసుకున్నారని.. అందులోని మూలకథను తీసుకుని తమిళ సినిమాకు తగినట్లు మార్పులు చేసి లియోని తెరకెక్కిచారని చెప్తున్నారు డేవిడ్ క్రోనెన్ బర్గ్ దర్శకత్వంలో 2005లో వచ్చిన హాలీవుడ్ సినిమా 'ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్' కల్ట్ క్లాసిక్ గ్యాంగ్‌స్టర్ సినిమాగా నిలిచింది. అయితే ట్విస్ట్ ఏమిటంటే... ఈ చిత్రాన్ని ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు చూసేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో జగపతి బాబు ప్రధాన పాత్రలో సీన్ టు సీన్ తీశారు. 2010లో గాయం 2 పేరుతో రిలీజైన ఈ చిత్రం ఫరవాలేదనిపించుకుంది. ఇప్పుడు అదే 'ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్' సినిమాలోని ఓ కోర్ పాయింట్‌ను తీసుకుని దర్శకుడు లోకేశ్ తనదైన స్టైల్లో మార్చి స్క్రిప్టు రాసుకుని డైరెక్ట్ చేశారట. ఎలాగో లోకేశ్ టాలెంట్ ఎలాంటిదో ఇప్పటికే ఖైదీ, మాస్టర్, విక్రమ్ చిత్రాలతో చూశాం. కాబట్టి లియోను కాపీలా కాకుండా అద్భుతంగా తెరకెక్కించే ఉంటారని అభిమానులు ఆశపడుతున్నారు.
'లియో' చిత్రాన్ని సెవెన్ స్కీన్స్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళానిసామి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిషతో పాటు తెలుగులో 'లీడర్' సహా కొన్ని సినిమాలు చేసిన హీరోయిన్ ప్రియా ఆనంద్ కీలక పాత్ర చేశారు. ఇంకా బాలీవుడ్ స్టార్, 'కెజియఫ్'తో విలన్ గా దక్షిణాది ప్రేక్షకుల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న హిందీ హీరో సంజయ్ దత్ ఓ పాత్రలో నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, నటుడు మన్సూర్ అలీ ఖాన్, మలయాళ నటుడు మాథ్యూ తదితరులు ఉన్నారు. ఈ సినిమాకు ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస, కూర్పు : ఫిలోమిన్ రాజ్, కళ : ఎన్. సతీష్ కుమార, యాక్షన్ : అన్బరివ్.