Asianet News TeluguAsianet News Telugu

విజయ్ చివరి సినిమా..డైరక్టర్ ఫైనల్ ..ఎవరంటే?

RRR సినిమా తెరకెక్కించిన DVV ఎంటర్టైన్మెంట్స్ సంస్థకి విజయ్ గతంలో ఓ సినిమా చేస్తానని చెప్పినట్ట్టు సమాచారం.

Thalapathy Vijay Last Film Thalapathy 69 director finalised jsp
Author
First Published Apr 1, 2024, 7:57 AM IST


ప్రస్తుతం విజయ్ తన 68వ సినిమాగా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అనే సినిమా చేస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.  ఈ సినిమా తర్వాత రెండు సినిమాలు చేసి 70 సినిమాలతో ఆపాలని అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. మరో ప్రక్క 69వ సినిమానే లాస్ట్ సినిమా అవ్వొచ్చు అంటున్నారు. RRR సినిమా తెరకెక్కించిన DVV ఎంటర్టైన్మెంట్స్ సంస్థకి విజయ్ గతంలో ఓ సినిమా చేస్తానని చెప్పినట్ట్టు సమాచారం. దీంతో తన లాస్ట్ సినిమా DVV ఎంటర్టైన్మెంట్స్ లో ఉండనుంది. అయితే ఈ సినిమాని డైరక్ట్ చేసేది ఎవరు...
 
విజయ్ చివరి సినిమా కూడా పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో ఉండాలని ప్లాన్ చేస్తున్నాడట. అందుకోసం చాలా మంది డైరక్టర్స్ ని అనుకున్నారు. ఓ టైమ్ లో  తెలుగు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ అదిరిపోయే కథను రెడీ చేశారని వార్తలు వచ్చాయి. గోపీచంద్ మలినేని డైరక్ట్ చేసే అవకాసం ఉందని అన్నారు. అదేం కాదు... తమిళ్ లో అలాంటి సోషల్ మెసేజ్ తో పాటు రా & రస్టిక్ గా సినిమాలు తీసే వెట్రిమారన్ తో విజయ్ సినిమా ఉంటుందని అన్నారు. దీంతో విజయ్ చివరి సినిమా తెలుగు నిర్మాత DVV దానయ్య – తమిళ్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో ఉండబోతుందని వార్తలు వచ్చాయి. అయితే అదీ నిజం కాదని తేలింది. 

ఫైనల్ గా హెచ్. వినోద్ సీన్ లోకి వచ్చారని సమాచారం. హెచ్ వినోద్... గతంలో అజిత్ తో రెండు సినిమాలు చేసారు. కార్తితో ఓ సినిమా చేసారు. అలాగే కమల్‌హాసన్‌ తాజాగా హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తానంటూ ప్రకటన ఇచ్చారు. ఈ చిత్రానికి స్వయంగా కమల్‌హాసన్‌ కథను అందించడం విశేషం. రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇండియా నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అయితే ఆ చిత్రం లేటు అయ్యేలా ఉండటంతో ఈ లోగా విజయ్ తో ముందుకు వెళ్తున్నారని తెలుస్తోంది.

రీసెంట్ గా హెచ్ వినోద్... ఓ  కథను విజయ్ కి వినిపించగా ఆయనకు బాగా నచ్చిందట ఆ కథ. వెంటనే ఒకే చెప్పేశాడట. పొలిటికల్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబందించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారట. ఇక విజయ్ ప్రస్తుతం దర్శకుడు వెంకట్ ప్రభుతో గోట్(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టీమ్) అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయినా వెంటనే హెచ్ వినోద్, విజయ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. మరి విజయ్ కెరీర్ లో చివరి సినిమాగా వస్తున్న ఈ మూవీ ఎలాంటి కంటెంట్ తో రానుందో చూడాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios