తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ సొంత చేసుకున్న నటుడు ఇళయదళపతి విజయ్. వరుసగా విజయాలు దక్కుతున్న కొంచెం కూడా గర్వం లేకపోవడం, సింపుల్ గా ఉండడం ఆయన్ని అభిమానులకు చేరువ చేశారు.

తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ సొంత చేసుకున్న నటుడు ఇళయదళపతి విజయ్. వరుసగా విజయాలు దక్కుతున్న కొంచెం కూడా గర్వం లేకపోవడం, సింపుల్ గా ఉండడం ఆయన్ని అభిమానులకు చేరువ చేశారు. ఇక విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే డిమాండ్ ఇప్పటిది కాదు. గత కొన్నేళ్లుగా విజయ్ ఫాన్స్ చేస్తున్న డిమాండ్ ఇది. 

విజయ్ అడుగులు రాజకీయాల వైపు పడుతున్నట్లు అనిపిస్తున్నప్పటికీ.. ఇప్పటికిప్పుడు సాధ్యం అయ్యేలా అనిపించడం లేదు. ఇటీవలే విజయ్ పుదుచ్చేరి ముఖ్యమంత్రిని కలిశారు. అయితే త్వరలో తమిళనాడులో స్థానిక సంస్థ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది విజయ్ అభిమానులు ‘కమాండర్ విజయ్ పీపుల్స్ మూమెంట్’ పేరుతో స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నారు. 

వీళ్ళందరికీ హీరో విజయ్ మద్దతు ఉన్నట్లుగా ఓ కీలక ప్రకటన వెలువడింది. వీరందరికి తన అభిమానులు మనస్ఫూర్తిగా మద్దతు ఇవ్వాలని, ప్రచారం చేయాలని విజయ్ కోరినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటన నేరుగా విజయ్ నుంచి వచ్చిందా లేక అభిమానులే ఇలా ప్రచారం చేస్తున్నారా అనేది క్లారిటీ లేదు. 

అయితే ‘కమాండర్ విజయ్ పీపుల్స్ మూమెంట్’ ఒక ప్రజా ఉద్యమం లాగా సాగుతుందని.. ఏ ఇతర రాజకీయ పార్టీకి తాము మద్దతు కానీ, పొత్తు కానీ పెట్టుకోవడం లేదని తెలిపారు. ఈ ప్రకటన చూసిన వారంతా విజయ్ పాలిటిక్స్ లోకి ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చినట్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

గతంలో ఓ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. విజయ్ వేదికపై తాను సీఎం అయితే చాలా వైవిధ్యంగా వ్యవహరిస్తాను అంటూ విజయ్ కామెంట్స్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.