టాలీవుడ్ లో తెలుగమ్మాయిలకు అవకాశాలు రావడం లేదని, వారికి సరైన పాత్రలు దక్కడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 

టాలీవుడ్ లో తెలుగమ్మాయిలకు అవకాశాలు రావడం లేదని, వారికి సరైన పాత్రలు దక్కడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తెలుగమ్మాయిలు గ్లామరస్ గా ఉండరని, తెరపై గ్లామర్ షో చేయడానికి మొహమాట పడుతుంటారని గతంలో కొందరు నిర్మాతలు కామెంట్స్ చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయితే ఈ మధ్యకాలంలో తెలుగమ్మాయిలు కూడా గ్లామర్ షో చేస్తున్నారు. శోబితా ధూళిపాళ్ళ వంటి హీరోయిన్లు ఎంతగా ఎక్స్ పోజ్ చేస్తున్నారో చెప్పనక్కర్లేదు. ఈ లిస్ట్ లో మరో తెలుగు బ్యూటీ కూడా ఉంది. గ్లామర్, నటన రెండు కలగలిపిన ఈ తారకి అవకాశాలు మాత్రం రావడం లేదు.

అయితే తన పేరు బయట పెట్టకుండా ఈ భామ తనకు అవకాశాలు ఎందుకు రావడం లేదనే విషయాన్ని వెల్లడించింది. కెరీర్ ఆరంభంలో ఈ అమ్మడు ఓ డైరెక్టర్ తో కాస్త ఎక్కువ సాన్నిహిత్యం పెంచుకుందట. అతడేమో తాను చేసిన చిన్న చిన్న సినిమాల్లో ఆమెకి హీరోయిన్ గా అవకాశాలు బాగానే ఇచ్చాడు. కానీ పెద్ద హీరోలు, దర్శకుల సినిమాల్లో గ్లామర్ పాత్రలు చేస్తానంటే మాత్రం అడ్డుకునేవాడట. 

ఆ తరువాత అతడికి పెద్ద సినిమా ఛాన్స్ రావడంతో.. అందులో స్టార్ హీరోయిన్ లను పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఈ తెలుగమ్మాయిని పట్టించుకోవడం మానేశాడు. దీంతో ఇప్పుడు ఆమె మళ్లీ మొదటి నుండి ప్రయత్నాలు మొదలుపెడుతోంది. ఆ డైరెక్టర్ మాట వినకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉంటే మరోలా ఉండేదని చెప్పుకొని వాపోయింది.