Asianet News TeluguAsianet News Telugu

పవన్‌కు ఝులక్... ఆ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక ప్రకటన

ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో కొందరు సినీ పెద్దలు పవన్‌కల్యాణ్‌కు అండగా నిలుస్తున్నారు. అటు ఏపీ మంత్రులు జనసేనానికి ఉదయం నుంచి కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది.

telugu film chamber of commerce announcement on janasena chief pawan kalyan remarks on ap govt
Author
Hyderabad, First Published Sep 26, 2021, 7:39 PM IST

ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో కొందరు సినీ పెద్దలు పవన్‌కల్యాణ్‌కు అండగా నిలుస్తున్నారు. అటు ఏపీ మంత్రులు జనసేనానికి ఉదయం నుంచి కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. సినీ పరిశ్రమకు రెండు ప్రభుత్వాల మద్ధతు అవసరమని స్పష్టం చేసింది. ప్రభుత్వల మనుగడ లేకుండా సినీ పరిశ్రమ మనుగడ కష్టమని.. వ్యక్తిగత అభిప్రాయాలతో మాకు సంబంధం లేదని తేల్చిచెప్పింది. ప్రస్తుత పరిస్ధితుల్లో తెలుగు సినీ పరిశ్రమ కష్టాల్లో వుందని ఛాంబర్ తెలిపింది. సినీ పరిశ్రమపై ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం వుంటుందని వెల్లడించింది. వ్యక్తిగత అభిప్రాయాలను వివిధ వేదికలపై చెబుతున్నారని తెలిపింది. ప్రభుత్వాల నుంచి ఎప్పుడూ సహకారం అందుతూనే వుందని ఛాంబర్  స్పష్టం చేసింది. 

కాగా, రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ పూర్తిగా పొలిటికల్ యాంగిల్ లో సాగిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, నాయకులు టార్గెట్ గా ఆయన విరుచుకుపడ్డారు. సినిమా టికెట్ల రేట్లు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధానాలు చిత్రపరిశ్రమను దెబ్బతీసేవిగా ఉన్నాయని ఆవేశం వ్యక్తం చేశారు. తన ఒక్కడి సినిమాలు ఆపడం కోసం పరిశ్రమ మొత్తాన్ని టార్గెట్ చేశారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

ALso Read:చిరంజీవి వైసీపీ ప్రభుత్వాన్ని బ్రతిమిలాడుకుంటున్నారు ... వాడు ఓ సన్నాసి.. పవన్ సెన్సేషనల్ కామెంట్స్

పరిశ్రమకు జరుగుతున్న అన్యాయంపై పెద్దలు నోరువిప్పి మాట్లాడాలని పవన్ అన్నారు. ఇక చిరంజీవి గారు వాళ్ళను ఎందుకు బ్రతిమిలాడుకుంటారని, ఓ వ్యక్తి నాతో అన్నారు, ఆయనది మంచి మనసు బ్రతిమిలాడుకుంటారు. ఎవరో ఓ మంత్రి చిరంజీవితో నాకు సోదరభావం ఉందని అన్నారు. చిత్ర పరిశ్రమకు అక్కరకు రాని సోదర భావం ఎందుకు. దాన్ని తీసుకెళ్లి చెత్తలో వేయండి అంటూ విరుచుకుపడ్డారు. నేను అన్నిటికీ తెగించే ఇలా మాట్లాడుతున్నాను అన్న పవన్ కళ్యాణ్.. వైసీపీ మంత్రిని సన్నాసి అంటూ సంబోధించడం విశేషం. ఇక బాలయ్యను కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్లు అనిపించింది. మా వంశాలు వేరు, మేము లేస్తే మనుషులం కాదని చెప్పుకునేవారు దైర్యంగా ముందుకు వచ్చి ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని గట్టిగా నిలదీశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios