గద్వాల నందు గల శ్రీనివాస టాకీస్ లో వకీల్ సాబ్ చిత్రం ప్రదర్శితం అవుతుంది. వకీల్ సాబ్ మూవీ ప్రదర్శన సమయంలో థియేటర్ లో సాంకేతిక లోపం తలెత్తింది.దీనితో వకీల్ సాబ్ ప్రదర్శన మధ్యలో ఆగిపోయింది. 

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆవేశం అయినా, ఆనందం అయినా ఆపడం అంత సులువు కాదు. అలాంటిది వారు ఎంతగానో ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ చిత్ర ప్రదర్శన మధ్యలో ఆగిపోతే ఇంకేమైనా ఉందా. సరిగ్గా అదే జరిగింది. వకీల్ సాబ్ మూవీ నేడు వరల్డ్ వైడ్ గా 2000కు పైగా థియేటర్స్ లో విడుదల కావడం జరిగింది. అర్థరాత్రి నుండే వకీల్ సాబ్ ప్రదర్శనలు జరుగుతున్నాయి. పవన్ సినిమా కోసం దాహంతో ఉన్న ఫ్యాన్స్ థియేటర్స్ కి పోటెత్తారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred


వకీల్ సాబ్ ప్రదర్శితం అవుతున్న థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ కోలాహలం మాములుగా లేదు. పవన్ కట్ ఔట్స్ కి పాలాభిషేకాలు, హారతులు ఇస్తూ ఫ్యాన్స్ అభిమానం చాటుకుంటున్నారు. కాగా గద్వాల నందు గల శ్రీనివాస టాకీస్ లో వకీల్ సాబ్ చిత్రం ప్రదర్శితం అవుతుంది. వకీల్ సాబ్ మూవీ ప్రదర్శన సమయంలో థియేటర్ లో సాంకేతిక లోపం తలెత్తింది.దీనితో వకీల్ సాబ్ ప్రదర్శన మధ్యలో ఆగిపోయింది. 


ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం అంటూ నినాదాలు చేశారు. అయితే శాటిలైట్ సిగ్నల్ సమస్య కారణంగా షోకి అంతరాయం ఏర్పడినట్లు తెలుసుకొని ఫ్యాన్స్ శాంతించారట. సాంకేతిక లోపం పునరుద్దరించాక యదావిధిగా షో నడిపారని సమాచారం. 


ఇక వకీల్ సాబ్ కి మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంటుంది. పవన్ వకీల్ సాబ్ తో గ్రాండ్ పవన్ కమ్ బ్యాక్ ఇచ్చాడని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. వకీల్ సాబ్ రికార్డు ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం కలదని, ట్రెండ్ టాక్ .