Asianet News TeluguAsianet News Telugu

‘మన్మథుడు 2’ కొత్త టీజర్... అవంతిక అదరకొట్టింది

‘అవంతిక.. పేరు ఎంత సూపర్‌గా ఉందో అంత పద్ధతిగల అమ్మాయి’ అన్న డైలాగ్‌తో రకుల్‌ పాత్రను పరిచయం చేస్తూ టీజర్ వదిలింది మన్మధుడు 2 టీమ్ . 

Teaser: Rakul Preet Singh as Avantika in Manmadhudu 2
Author
Hyderabad, First Published Jul 9, 2019, 10:33 AM IST

‘అవంతిక.. పేరు ఎంత సూపర్‌గా ఉందో అంత పద్ధతిగల అమ్మాయి’ అన్న డైలాగ్‌తో రకుల్‌ పాత్రను పరిచయం చేస్తూ టీజర్ వదిలింది మన్మధుడు 2 టీమ్ . అవంతిక పైకి చూడటానికి సంప్రదాయంగా కనిపిస్తూనే మరోపక్క ఊరమాస్‌గా ప్రవర్తిస్తూ ఉంటుంది. సిగరెట్లు తాగుతూ అల్లరి పిల్లలా ప్రవర్తిస్తుంటుంది. 

నాగార్జున, దర్శకుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం మ‌న్మ‌థుడు 2. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, స‌మంత అతిధి పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర టీజ‌ర్ రీసెంట్ గా   విడుద‌ల చేశారు. ఇందులో పెళ్ళికాని నడి వ‌య‌స్కుడిగా నాగ్ న‌ట‌న ఫ్యాన్స్ ని నవ్వుల్లో ముంచెత్తింది. 

అయితే టీజ‌ర్‌లో హీరోయిన్ గా న‌టిస్తున్న ర‌కుల్‌ని చూపించ‌క‌పోయే స‌రికి అభిమానులు నిరాశ చెందారు. రాహుల్ ర‌వీంద్ర‌న్‌కి ట్వీట్ చేశారు. దీనిపై క్లారిటీ ఇచ్చిన రాహుల్‌.. టీజ‌ర్‌లో ర‌కుల్‌ని చూపించ‌కపోవ‌డానికి కార‌ణం ఆమె కోసం స‌ప‌రేట్‌గా ఓ టీజ‌ర్ క‌ట్ చేశాం. అందుకే ర‌కుల్‌ని టీజ‌ర్‌లో చూపించ‌లేదు అని తెలిపారు. అన్న‌ట్టుగానే ర‌కుల్‌కి సంబంధించి ప్రోమో వీడియో విడుద‌ల చేశారు.  ఈ టీజర్ ని మీరు ఇక్కడ చూడండి.

మ‌న్మ‌థుడు 2 చిత్రం ఆగ‌స్ట్ 9న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. రావు రమేశ్‌, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్‌, దేవదర్శిణి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నాగార్జున స్వయంగా జెమిని కిర‌ణ్‌‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆర్‌ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా ప‌ని చేస్తున్నారు. ఫ‌న్ రైడ్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్‌9న విడుద‌ల చేయ‌నున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios