విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం 'టాక్సీవాలా'. ఈ సినిమాతో రాహుల్ సంక్రిత్యాన్ అనే నూతన దర్శకుడు తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. హారర్ కామెడీ నేపధ్యంలో సాగే ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం 'టాక్సీవాలా'. ఈ సినిమాతో రాహుల్ సంక్రిత్యాన్ అనే నూతన దర్శకుడు తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. హారర్ కామెడీ నేపధ్యంలో సాగే ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుస విజయాలతో దూకుడు మీదున్న విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా గురించి నెటిజన్లు ఏం అనుకుంటున్నారో.. ట్విట్టర్ రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.
హైఫై సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా కొత్త ప్రయోగంతో ఈ సినిమా డీసెంట్ గా ఉందని.. ఒకసారి సినిమా చూడొచ్చని అంటున్నారు. ఈ సినిమా మొదటి నుండి ఎండ్ టైటిల్స్ పడే వరకు ఎంజాయ్ చేయోచ్చని.. ప్రతి ఫ్రేమ్ థ్రిల్ చేసిందని అంటున్నారు.
విజయ్ వీరాభిమానులకు ఈ సినిమా కనెక్ట్ అవుతుంటే రెగ్యులర్ సినిమా ఆడియన్స్ మాత్రం ఈ సినిమా బోరింగ్ అంటూ పెదవి విరుస్తున్నారు. బిలో ఏవరేజ్ సినిమా అంటూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్టోరీలో లాజిక్ లేదని అనవసరంగా సినిమాను హైప్ చేస్తున్నారంటూ మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు.