Asianet News TeluguAsianet News Telugu

2.0 వచ్చే వరకు టాక్సీ వాలాకి తిరుగులేదు..!

టాక్సీ వాలా సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చేశాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. తన స్టామినాతో సినిమాకు మంచి క్రేజ్ తీసుకువచ్చిన ఈ హీరో సినిమాపై మొదట్లో కొన్ని అనుమానాలు వచ్చినప్పటికీ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

taxiwala box office collections latest update
Author
Hyderabad, First Published Nov 21, 2018, 6:15 PM IST

టాక్సీ వాలా సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చేశాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. తన స్టామినాతో సినిమాకు మంచి క్రేజ్ తీసుకువచ్చిన ఈ హీరో సినిమాపై మొదట్లో కొన్ని అనుమానాలు వచ్చినప్పటికీ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే సినిమా పెట్టిన బడ్జెట్ ను షేర్స్ రూపంలో ఫాస్ట్ గానే రికవర్ చేసింది. 

నాలుగు రోజుల్లో 30 కోట్ల గ్రాస్ ని దాటేసినట్లు సమాచారం. ఇక వచ్చే కలెక్షన్స్ అన్ని కూడా లాభాలే. సినిమా ద్వారా నిర్మాతకు మంచి లాభాలు అందుతాయని చెప్పవచ్చు. పైగా ట్యాక్సీ వాలా కు పోటీగా మరో సినిమాలు లేకపోవడం మేజర్ ప్లస్ పాయింట్. అమర్ అక్బర్ ఆంటోని ఏంటో మొదటిరోజే తెలిసిపోయింది. దీంతో 2.0 రిలీజ్ వరకు టాక్సీ వాలా కలెక్షన్స్ లో ఏ మాత్రం హెచ్చు తగ్గులు కనిపించకుండా ఒక లెవెల్లో వెళతాయని టాక్ వస్తోంది.

నోటా సినిమాతో డిజాస్టర్ అందుకున్న విజయ్ మొత్తానికి టాక్సీ వాలా తో మళ్ళీ సెట్టయ్యాడు. సినిమా హారర్ కాన్సెప్ట్ లో రావడం విజయ్ టైమింగ్ పర్ఫెమెన్స్ అలాగే కామెడీ వంటి అంశాలు సినిమాలో వర్కౌట్ అయ్యాయి. రాహుల్ ఎస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గీత ఆర్ట్స్ యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా రిలీజ్ చేశాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios