“పెళ్ళిసందD ” భాధ్యత తణికెళ్ల భరణి చేతిలో ?

ఈ సినిమాకు దర్శకుడుగా మొదట అనుకున్నగా కాకుండా తణికెళ్ల భరణి కు దర్శకత్వ భాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఫన్,లవ్ కలగలిపిన ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రాన్ని సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపంగా తీర్చిదిద్దాలని రాఘవేంద్రరావు ఆలోచనట. దాంతో ఆయన పర్యవేక్షకుడుగా ఉంటూ భరణి దర్శకత్వంలో సినిమా చేస్తే ఎలా ఉంటుందని ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. 

Tanikella Bharani will direct Pelli Sandadi jsp

 ఆర్కా మీడియా వర్క్స్ సమర్పణలో ఆర్ కె ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్ పై దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో  హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో గా “పెళ్ళిసందD ” మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ “పెళ్ళిసందడి “ మూవీకి రీమేక్ గా ఈ మూవీ రూపొందనుందని చెప్పబడుతున్న ఈ చిత్రానికి .... కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

 ఈ సినిమాకు దర్శకుడుగా మొదట అనుకున్నగా కాకుండా తణికెళ్ల భరణి కు దర్శకత్వ భాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఫన్,లవ్ కలగలిపిన ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రాన్ని సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపంగా తీర్చిదిద్దాలని రాఘవేంద్రరావు ఆలోచనట. దాంతో ఆయన పర్యవేక్షకుడుగా ఉంటూ భరణి దర్శకత్వంలో సినిమా చేస్తే ఎలా ఉంటుందని ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ మేరకు తణికెళ్ల భరణితో డిస్కషన్స్ జరుపుతున్నట్లు వినికిడి.  ‘మ్యూజికల్‌ సిట్టింగ్స్‌ ప్రారంభం అయ్యాయి, నటీనటుల వివరాలు త్వరలో చెబుతాం’ అని ఓ వీడియో ద్వారా ప్రకటించారు. మాధవి కోవెలమూడి, ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.  

అలాగే ఈ సినిమాకు ‘పెళ్ళిసందD’ అంటూ తమాషా టైటిల్ పెట్టడానికి కారణం ఉందంటున్నారు. ఈ  సినిమాలో ‘D’ అనే అక్షరానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని, అదే  సినిమాకి అదే హైలైట్ పాయింట్ అంటున్నారు.  పెళ్ళిసందడి తరహాలోనే ఈ సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని అందులో ఒక హీరోయిన్ పేరు ‘D’ అనే అక్షరంతో ఉంటుందని.. ఈ సినిమాను లీడ్ చేసే పాయింట్ అదేనని తెలుస్తోంది.  ప్రస్తుతం హీరోయిన్స్ అన్వేషణలో మేకర్స్ ఉన్నారట. అప్పటి సినిమాకి  సంగీతం అందించిన కీరవాణే ఈ మూవీకి కూడా సంగీత దర్శకుడు. ఇప్పటికే  ఈ సినిమాకి సంబంధించిన ఆరు పాటల ట్యూన్స్ సిద్ధం చేశారని తెలుస్తోంది. మరి ఈ ‘పెళ్ళిసందD’ కూడా అప్పటి సినిమాలాగానే మ్యాజిక్ చేస్తుందని సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios