Asianet News TeluguAsianet News Telugu

సూర్య సరికొత్త ప్రమోగం. 20 ఏళ్లు వయస్సుతగ్గబోతున్న తమిళ స్టార్ హీరో..

ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు తమిళ స్టార్ హీరో సూర్య. ఈక్రమంలో సూర్య మరోసారి ప్రయోగానికి సిద్దం అవుతున్నట్టు  తెలుస్తోంది. 
 

Tamil Star Hero Suriya New Expermantal Movie JMS
Author
First Published Oct 14, 2023, 3:38 PM IST

తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే ప్రయోగాలకు పెట్టిందిపేరు. మొదటి నుంచిస్టార్ హీరోలు తమ కెరీర్ లో ఏదో ఒక ప్రయోగం చేసిన వారే. ముఖ్యంగా  కమల్‌, రజనీ ఆతర్వాత టాలీవుడ్‌లో ఆ స్థాయి క్రేజ్‌ సంపాదించుకున్న నటుడు సూర్య. ఈ తమిళ హీరో సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ మార్కెట్ ను సాధిస్తుంటాయి. ఇక్కడ కూడా ఆయనకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన సినామలు ఎలా ఆదరిస్తారో ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలు చూస్తే తెలుస్తోంది. 

ఇక మన టాలీవుడ్ లో సూర్య సినిమాలకు ఎంత ఆధరణ వస్తుందో తెలిసిందే..  మనోళ్లు సూర్యను దత్త పుత్రుడు అంటూ ప్రేమగా పిలుచుకుంటుంటారు. ఆయన ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నాడు. ప్రస్తుతం సూర్య కంగువా సినిమాతో బిజీగా ఉన్నాడు. పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. ఇక ఈ సినిమా పూర్తవ్వగానే మరికొన్నిసినిమాలు లైన్ చేస్తున్నాడు సూర్య. 

కంగువ సినిమా అయిపోగానే..  సుధా కొంగరతో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు చివరి దశకు వచ్చేశాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్‌ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఈ సినిమాలో సూర్య కాలేజీ కుర్రాడిలా కొంత సేపు కనిపించనున్నాడట. అంతేకాకుండా సినిమాను నడిపించేది ఆ పాత్రే అని చెన్నై టాక్‌. మాములుగానే కాలేజీ కుర్రాడి పాత్ర అంటే సూర్య చింపేస్తాడు. ఇక ఇప్పుడు సినిమాలో కీ రోల్‌ అదే అంటే ఓ రేంజ్‌లో నటిస్తాడో ఊహకు కూడా అందదు.

Follow Us:
Download App:
  • android
  • ios