Asianet News TeluguAsianet News Telugu

40 ఏళ్ళ వయస్సులో స్టార్ హీరో ధనుష్ కు యూత్ ఐకాన్ అవార్డ్..

40 ఏళ్ల వయస్సులో తమిళ స్టార్ హీరో ధనుష్ అరుదైన ఘనత సాధించారు. నాలుగు పదుల వయస్సులో ఆయన యూత్ ఐకాన్ గా గుర్తింపు పొందారు. ఈ విషయంలో ధనుష్ ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు.
 

Tamil Star Hero Dhanush won youth icon award at 40 JMS
Author
First Published Apr 24, 2023, 12:33 PM IST

తమిళ సినీపరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగిన ధనుష్.. తన టాలెంట్ తో కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఏమాత్రం ఉపయోగించుకోకుండా.. తన సొంత కాళ్ళమీద నిలబడ్డాడు ధనుష్. నటనతో పాటు ఆటిట్యూడ్ తో అభిమానుల మనసుస్సుల్లో నిలిచిపోయాడు హీరో. ప్రస్తుతం టాలీవుడ్ పై కూడా గురిపెట్టిన ధనుష్ వెంకీ అట్లూరితో సార్ సినిమా చేసి.. సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నాడు. అంతే కాదు.. టాలీవుడ్ లో మార్కెట్ ను పెంచుకున్నాడు ఇక తాజాగా ఆయన మరో ఘనత కూడా సాధించారు. 

40 ఏళ్ల వయసులో యూత్ ఐకాన్ అవార్డ్ అందుకున్నారు ధనుష్. భారత పరిశ్రమల సమాఖ్య (CII) ఆధ్వర్యంలో దక్షిణ్‌ 2023 పేరుతో రెండు రోజుల పాటు చెన్నైలో జరిగిన సౌత్‌ ఇండియా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సమ్మిట్‌ ముగింపు వేడుక గురువారం రాత్రి జరుగగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా..  యూత్‌ ఐకాన్‌ అవార్డును అందుకున్నారు థనుష్. ఈసందర్భంగా మాట్లాడారు స్టార్ హీరో. 

ధనుష్ మాట్లాడుతూ.. 40 యేళ్ళ వయసులో యూత్‌ ఐకాన్‌ అవార్డు అందుకోవడం నాకు ఎంతో బలాన్నిచ్చింది.  మరిన్ని సినిమాలు చేసేలా నన్ను ప్రోత్సహిస్తుందన్నారు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తన తల్లిదండ్రుల కృషి ఉందన్నారు.తనపై ఇంత అభిమానన్ని చూపిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు ధనుష్. ఈ అవార్డ్ నుఅందించిన మంత్రికి కూడా థ్యాంక్స్ చెప్పారు. ఇక థనుష్ మాట్టాడిన తరువాత కేంద్ర మంత్రి  అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. వినోద పరిశ్రమ వ్యాపారం ప్రస్తుతం 30 బిలియన్లుగా ఉందని, వచ్చే 2030 నాటికి ఇది 70 బిలియన్లకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ డెవలప్ మెంట్ సినిమాలు, థియేటర్లు మాత్రమే కాదు...  ఓటీటీ, డిజిటల్‌ అడ్వర్‌టైజింగ్‌ల భాగస్వామ్యంతో జరిగిందన్నారు. ఇందో వాటి భాగం మూడో వంతుగా ఉందన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios