Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: కిరాణా షాపు పెట్టుకున్న దర్శకుడు

సినిమా కార్మికులలో  రెక్కాడితేనే గానీ డొక్కాని కష్టజీవుల పరిస్థితి అయితే వర్ణనాతీతంగా ఉంది. సెటిల్ అయ్యి సంపాదించుకున్న వారి పరిస్దితి వేరే. ఇప్పుడిప్పుడే మెల్లిగా నిలదొక్కుకుంటన్న వారిపై కరోనా చావు దెబ్బ కొట్టింది. దాంతో వారు బ్రతుకు తెరువు కోసం వేరే మార్గాలు వెతుక్కుంటున్నారు. రీసెంట్ గా ఓ సినిమా దర్శకుడు కిరాణా షాపు పెట్టుకోవటం జరిగింది. 

Tamil film director Anand, has opened a grocery shop
Author
Hyderabad, First Published Jul 5, 2020, 10:53 AM IST

కరోనా కష్టకాలంలో లాక్ డౌన్ దెబ్బతో అన్ని రంగాలతో పాటు.. అన్ని ఉత్పత్తి వ్యవస్థలతో పాటు  సినిమా రంగం కూడా ఛిన్నాభిన్నమైపోయింది. సినిమా కార్మికులలో  రెక్కాడితేనే గానీ డొక్కాని కష్టజీవుల పరిస్థితి అయితే వర్ణనాతీతంగా ఉంది. సెటిల్ అయ్యి సంపాదించుకున్న వారి పరిస్దితి వేరే. ఇప్పుడిప్పుడే మెల్లిగా నిలదొక్కుకుంటన్న వారిపై కరోనా చావు దెబ్బ కొట్టింది. దాంతో వారు బ్రతుకు తెరువు కోసం వేరే మార్గాలు వెతుక్కుంటున్నారు. రీసెంట్ గా ఓ సినిమా దర్శకుడు కిరాణా షాపు పెట్టుకోవటం జరిగింది. 

వివరాల్లోకి వెళితే.... కరోనా లాక్‌డౌన్ కారణంగా షూటింగులు నిలిచిపోవడంతో బతుకు తెరువు కోసం ఓ తమిళ దర్శకుడు కిరాణాషాపు పెట్టుకున్నాడు. ‘ఓరు మజాయ్ నాంగు సారాల్’ , మౌనా మజాయ్’ వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆనంద్ ఇప్పుడు కిరాణా దుకాణం పెట్టుకుని బతుకు బండి లాగిస్తున్నాడు. కరోనా భయం, లాక్‌డౌన్ కారణంగా చిత్రసీమ తెరుచుకోకపోవడంతో మరో మార్గం లేక చిన్న కిరాణా షాపు పెట్టుకున్నానని చెప్పుకొచ్చారు.

చెన్నైలోని మౌలివాక్కంలో ఓ స్నేహితుడికి చెందిన గదిని అద్దెకు తీసుకుని అందులో షాపు పెట్టుకున్నాడు. ప్రస్తుతం తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ నిత్యావసరాలకు ప్రభుత్వ అనుమతి ఉండడంతో ఆనంద్ కిరణా షాపు పెట్టుకున్నాడు. కాగా, ఆనంద్ ప్రస్తుతం ‘తునింతు సీ’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, కరోనా కారణంగా సినిమా మధ్యలోనే ఆగిపోయింది.   

Follow Us:
Download App:
  • android
  • ios