Asianet News TeluguAsianet News Telugu

పొన్నియన్ సెల్వన్ 1 ఎఫెక్ట్.. తెలుగు సినిమాలని ఫ్లాప్ చేస్తాం అంటూ తమిళ క్రిటిక్ బెదిరింపులు

తమిళ లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ 1 మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మణిరత్నం డ్రీం ప్రాజెక్టు ఈ చిత్రం. ఎంతో కష్టపడి ప్రతిష్టాత్మకంగా మణిరత్నం ఈ చిత్రాన్ని రూపొందించారు.

Tamil Critic controversial comments on telugu movies
Author
First Published Sep 30, 2022, 9:56 PM IST

తమిళ లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ 1 మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మణిరత్నం డ్రీం ప్రాజెక్టు ఈ చిత్రం. ఎంతో కష్టపడి ప్రతిష్టాత్మకంగా మణిరత్నం ఈ చిత్రాన్ని రూపొందించారు. విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, జయం రవి ఇలా ఈ చిత్రం మొత్తం స్టార్ కాస్టింగ్ ఉంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీకి ఆశించిన టాక్ రావడం లేదు. 

విజువల్స్, కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ స్లో నెరేషన్ కారణంగా ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారు అంటూ టాక్ వస్తోంది. తెలుగు క్రిటిక్స్ నుంచి కూడా ఈ చిత్రానికి నెగిటివ్ రివ్యూలే వచ్చాయి. మూవీ ఎంగేజింగ్ గా లేదని అంటున్నారు. మరోవైపు తమిళులు మాత్రం ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 

Tamil Critic controversial comments on telugu movies

తెలుగులో పొన్నియన్ సెల్వం చిత్రానికి వస్తున్ననెగిటివ్ టాక్ తో తమిళ ఫిలిం క్రిటిక్, పీఆర్ ప్రశాంత్ రంగస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళంలో విజయం సాధించే తెలుగు చిత్రాల పట్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ పనిగట్టుకుని తమిళ సినిమాలపై మీరు అక్కసు వెళ్లగక్కితే.. మేము కూడా అలాగే ప్రవర్తించి మీ చిత్రాలని డిజాస్టర్ చేస్తాం అంటూ బెదిరిస్తూ ట్వీట్ చేశారు. 

Tamil Critic controversial comments on telugu movies

ఈ ట్వీట్ వైరల్ గా మారింది. తెలుగు ఆడియన్స్ ప్రశాంత్ ట్వీట్ కి ధీటుగా బదులిస్తున్నారు. సినిమా బావుంటే ముందుగా ఆదరించేది తెలుగు ప్రేక్షకులే. సినిమా బాగాలేకపోతే ఎవరేం చేస్తారు అంటూ ఓ నెటిజన్ కౌంటర్ ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios