సినీ నటి వనిత విజయ్ కుమార్ ఇటీవల తన తండ్రి ఆస్తికి సంబంధించి గొడవలు పడి వార్తల్లో నిలిచింది. ఈ కేసులో ఆమె కోర్టుకెక్కింది. ఇప్పుడు మరోసారి తన కూతురు కేసులో వనిత కోర్టుని ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. వనితకి 14 ఏళ్ల క్రితం హైదరాబాద్ కి చెందిన ఆనంద్ రాజ్ తో వివాహం జరిగింది.

వీరికి జెనీతా(10) అనే కుమార్తె ఉంది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. జెనీతా తన తండ్రితో హైదరాబాద్ లో ఉండేది. ఈ క్రమంలో 2012లో తన కుమార్తెను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించిన వనిత, హైదరాబాద్ లో ఉంటున్న తన కూతురిని తీసుకోచ్చేసింది.

దీంతో ఆమె భర్త పోలీసులను ఆశ్రయించారు. తన కుతూరిని వనిత కిడ్నాప్ చేసిందంటూ కంప్లైంట్ చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు కూతురిని ఆనంద్ రాజ్ కి అప్పగించాలని వనితని కోరారు. ఈ క్రమంలో వనిత కోర్టుని ఆశ్రయించింది. జెనీతాకు తాను తల్లినని, తన కూతురు తనతో ఉందని, చిన్నారిపై పూర్తి హక్కుని తనకు అప్పగించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేసింది.

ఈ కేసు విచారణకి ఆనంద్ రాజ్ హాజరు కాకపోవడంతో తీర్పుని రిజర్వ్ లో ఉంచింది కోర్టు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన వనిత.. తన కూతురు కోసం కోర్టు మెట్లు ఎక్కానని, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకుడదని చెప్పింది.