Asianet News TeluguAsianet News Telugu

హెల్త్ ఇష్యూతో ఉన్నానంటూ రివీల్ చేసిన తమన్నా

బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్న ‘అంధాధున్‌’ రీమేక్‌గా ‘మాస్ట్రో’ తెరకెక్కింది. ఒరిజినల్‌లో ఆయుష్మాన్‌ ఖురానా పోషించిన పాత్రను నితిన్‌ పోషించగా.. టబు, రాధికా ఆప్టే పాత్రల్లో తమన్నా, నభానటేశ్‌ సందడి చేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా నెగటివ్‌ రోల్‌ పోషించారు.

Tamannaah reveals shes suffering from a health issue
Author
Hyderabad, First Published Sep 21, 2021, 4:17 PM IST

 సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు వెలిగిన ఉన్న తమన్నా.. ఆ మధ్య కాస్త స్లో అయినా .. మళ్లీ పికప్ అవ్వడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకుంది.  స్మాల్ స్క్రీన్ లో బిజీగా ఉంటూనే సినిమాలు కంటిన్యూగా చేస్తోంది.  అసలు ఖాళీ లేకుండా సిరీస్ లు చేస్తూనే సినిమాల్లో కూడా ఫుల్ బిజీ అయిపోయింది. అలాగే పాండమిక్ తర్వాత థియేటర్లలో రిలీజ్ అయిన ‘సీటీమార్’ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే నితిన్ ‘మ్యాస్ట్రో’ సినిమాలో నెగెటివ్ రోల్‌లో కనిపించి ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది. హిందీ ‘అంధాధూన్’ లో టబు చేసిన రోల్ తను చేసి మంచి అప్లాజ్ అందుకుందీ మిల్కీ బ్యూటీ. ఆమె ఎప్పుడు ఫిట్ గా అందంగా ఉంటుంది.

అయితే ఆమె ఒత్తిడితో తను అనారోగ్యం పాలైనట్లు చెప్పింది. రీసెంట్ గా మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ...ఈ హెల్త్ విషయం రివీల్ చేసింది. అయితే తనకు వచ్చిన సమస్య ఏమిటో చెప్పటానికి ఇష్టపడలేదు. ఇప్పటికే తాను ఫుడ్ హ్యాబెట్స్, లైఫ్ స్టైయిల్ మార్చుకున్నానని అంది.ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటున్నాను అని తెలిపింది.

15 సంవత్సరంలోనే శ్రీ సినిమాతో ఆమె తెలుగులో లాంచ్ అయ్యింది. బాహుబలి, వంటి పెద్ద హిట్స్ ఆమె కెరీర్ లో ఉన్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన సీటీమార్ లో జ్వాలా రెడ్డిగా కొత్తగా కనిపించి తమన్నా మళ్లీ కమ్ బ్యాక్ అయ్యింది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ అయ్యింది. తమన్నా ప్రజెంట్ సీటీమార్ సక్సెస్ ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు ..తన లేటెస్ట్ మూవీ మ్యాస్ట్రో ప్రమోషన్స్ తో సందడి చేస్తోంది. మేర్లపాక గాంధీ డైరెక్షన్లో నితిన్, నభానటేష్, లీడ్ రోల్స్ లో బాలీవుడ్ మూవీ అంధాదున్ రీమేక్ గా వచ్చిన మ్యాస్ట్రోలో ఇంట్రస్టింగ్ రోల్ చేస్తోంది మిల్కీ బ్యూటీ. కంప్లీట్ క్యారక్టర్సే కాకుండా స్పెషల్ సాంగ్స్ తో కూడా సందడి చేస్తోంది తమన్నా.

 అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా వచ్చి సూపర్ హిట్ అయిన ఎఫ్ 2కి సీక్వెల్ గా వస్తోంది ఎఫ్ 3. షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మూడు సినిమాలే కాకుండా సత్యదేవ్ తో గుర్తుందా సీతాకాలం, లేడీ ఓరియెంటెడ్ మూవీ దట్ ఈజ్ మహాలక్ష్మితో పాటు బాలీవుడ్ లో మరో రెండు సినిమాలు చేస్తోంది. ఇలా చేతి నిండా సినిమాలతో తెగ హంగామా చేస్తోంది తమన్నా.
  

Follow Us:
Download App:
  • android
  • ios