Asianet News TeluguAsianet News Telugu

డైరెక్షన్ లోకి ఫెమస్ ఫైట్ మాస్టర్

ఫైట్ మాస్టర్ గా ఎన్నో యాక్షన్ సినిమాలకు పని చేసిన పీటర్ హెయిన్స్ మెగా ఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నాడు. గత కొంత కాలంగా ఈ స్టంట్ మాస్టర్ దర్శకుడిగా యాక్షన్ అని చెప్పడానికి సిద్దమవుతున్నట్లు వస్తున్న వార్తలకు ఫైనల్ క్లారిటీ వచ్చేసింది. 

Talented Stunt Master peter  is debuting as director
Author
Hyderabad, First Published Sep 3, 2019, 4:56 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఫైట్ మాస్టర్ గా ఎన్నో యాక్షన్ సినిమాలకు పని చేసిన పీటర్ హెయిన్స్ మెగా ఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నాడు. గత కొంత కాలంగా ఈ స్టంట్ మాస్టర్ దర్శకుడిగా యాక్షన్ అని చెప్పడానికి సిద్దమవుతున్నట్లు వస్తున్న వార్తలకు ఫైనల్ క్లారిటీ వచ్చేసింది. లక్ష్మి నరసింహా ప్రొడక్షన్ లో పీటర్ తన మొదటి సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.

గౌత‌మ్ మీన‌న్ `చెలి`సినిమా ద్వారా  ఫైట్ మాస్ట‌ర్‌గా కెరీర్ ను స్టార్ట్ చేశాడు. అనంతరం `మురారి`తో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. అప‌రిచితుడు - శివాజీ - గ‌జిని - మ‌గ‌ధీర‌ - రోబో - బాహుబ‌లి వంటి సినిమాలకు వర్క్ చేశారు. ఇక ఇప్పుడు లక్ష్మి నరసింహా ప్రొడక్షన్ లో పీటర్ హెయిన్స్ పూర్తి కథను సిద్ధం చేసుకొని డైరెక్ట్ చేయడానికి సిద్దమయ్యాడు. 

లక్ష్మి - లక్ష్యం - రేసుగుర్రం - ముకుందా వంటి సినిమాలను నిర్మించిన నల్లమలుపు శ్రీనివాస్ బుజ్జి మాట్లాడుతూ.. పీటర్ ఎంచుకున్న కథ చాలా బావుంది. సినిమా స్టార్టింగ్ టూ ఎండింగ్ అద్భుతంగా ఉంటుంది.  మా బ్యానర్ లో ఈ సినిమా తప్పకుండా అద్భుతం విజయ సాదిస్తుందని అన్నారు. ఇక సినిమా నటీనటుల వివరాలను వీలైనంత త్వరగా తెలియజేస్తామని అంటూ సినిమాను దసరా రోజు పూజ కార్యక్రమాలతో స్టార్ట్ చేయనున్నట్లు నల్లమలుపు శ్రీనివాస్ వివరించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios