బాలీవుడ్ లో వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది తాప్సి పన్ను. ఆమె నటించిన పింక్, బద్లా మంచి విజయాలను నమోదు చేశాయి. గత ఏడాది బద్లా, సంధ్ కి  ఆంక్ అనే మూవీలో నటించారు. ఈ ఏడాది ప్రారంభంలో తప్పడ్ అనే మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేయడం జరిగింది. 

కాగా తాప్సి పన్ను రష్మీ రాకెట్ పేరుతో తెరకెక్కుతున్న ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ మూవీలో తాప్సి అథ్లెట్ రోల్ చేస్తున్నారు. ఈ పాత్ర కోసం ప్రత్యేక వ్యాయామం, శిక్షణ తీసుకున్న తాప్సి స్ట్రిక్ట్ ఆహార నియమాలు పాటిస్తున్నారు. నిజమైన ఓ లేడీ అథ్లెట్ లా కనిపించడం కోసం తాప్సి చాలా కష్టపడుతున్నారని సమాచారం. 

రష్మీ రాకెట్ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో తాప్సి సెట్స్ లో దర్శనం ఇచ్చారు.  రేస్ ట్రాక్ పై స్పోర్ట్స్ వేర్ లో జుట్టు ముడివేసుకుని రేస్ కి సిద్ధం అవుతున్న ఫోటోని తాప్సి తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అలాగే లెట్స్ డూ థిస్ అని కామెంట్ పెట్టింది. 

ప్రస్తుతం ఓ తమిళ చిత్రంతో పాటు, మరో హిందీ ఫిమేల్ సెంట్రిక్ మూవీ చేస్తున్నారు. ఇటీవల తాప్సి సిస్టర్స్ తో కలిసి మాల్దీవ్స్ కి వెకేషన్ కి వెళ్ళింది. మాల్దీవ్స్ బీచ్ లలో బికినిలో రచ్చ చేసిన తాప్సి అక్కడ కూడా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యారట. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Let’s do this ! 🏃🏻‍♀️ #RashmiRocket

A post shared by Taapsee Pannu (@taapsee) on Nov 8, 2020 at 7:54pm PST