పరిశ్రమలో హీరోయిన్స్ జీవితం చాలా ఒడిదుడుకులతో కూడుకొని ఉంటుంది. హీరోయిన్ గా సక్సెస్ కావడం అంత ఈజీ కాదు. ఓ స్థాయికి చేరే వరకు అనేక అవమానాలు, వేధింపులు ఎదుర్కోవలసి వస్తుంది. వాళ్ళ కలర్ ఫుల్ లైఫ్ వెనుక అనేక కన్నీటి గాథలు, అవమానాలు ఉంటాయి. కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్ తాప్సి ఎదుర్కొన్న కష్టాలు, అవమానాల గురించి ఆమె బయటపెట్టారు. 

తాజా ఇంటర్వ్యూలో తాప్సి మాట్లాడుతూ... ''నేను పరిశ్రమకు వచ్చిన కొత్తలో నా అందంపై నెగెటివ్ కామెంట్స్ చేశారు. అనేక  విచిత్రమైన అనుభవాలను ఎదుర్కొన్నాను. ఓ హీరో భార్య వద్దనడంతో,ఆ సినిమా నుండి నన్ను తొలగించారు. ఒక సినిమాలో నేను డబ్బింగ్ చెప్పినప్పుడు  అందులోని ఓ డైలాగ్ హీరోకి నచ్చలేదు, దాంతో దాన్ని మార్చమన్నారు. నేను కుదరదని చెప్పడంతో,  నాకు చెప్పకుండా  ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ను పిలిపించి, ఆ డైలాగ్‌ను వేరేగా చెప్పించారు. ఒకసారైతే నేను ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నప్పుడు, ఆ సినిమా హీరో మునుపటి సినిమా సరిగా ఆడలేదనీ, కాబట్టి బడ్జెట్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి కాబట్టి, నా రెమ్యూనరేషన్ తగ్గించుకోమన్నారు. ఇంకో హీరో అయితే సినిమాలో నా ఇంట్రడక్షన్ సీన్ మార్పించమని చెప్పాడు. ఎందుకంటే అతని ఇంట్రడక్షన్ సీన్ కంటే నా ఇంట్రడక్షన్ సీన్ బెటర్‌గా ఉందని. ఇవన్నీ నాకు తెలిసి జరిగిన విషయాలు. నాకు తెలీకుండా నా వెనుక ఏం జరిగాయో నాకు తెలీదు"  అన్నారు. 

తాప్సి చెప్పినవన్నీ హీరోయిన్స్ కి జరిగే సాధారణమైన అనుభవాలే అని చెప్పాలి. తాప్సి కెరీర్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఇటీవల ఆమె నటించిన గేమ్ ఓవర్, తప్పడ్, సాంద్ కీ ఆంఖ్ చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి. తాప్సి బాలీవుడ్ లో వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. రష్మీ రాకెట్ అనే స్పోర్ట్స్ డ్రామాలో తాప్సి అథ్లెట్ రోల్ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. మరో హిందీ, తమిళ్ చిత్రాలు తాప్సి ఖాతాలో ఉన్నాయి.