ప్రస్తుతం తాప్సి రష్మీ రాకెట్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో రష్మీ ప్రొఫెషనల్ రన్నర్ గా కనిపించనున్నారు. ఈ మూవీ కోసం తాప్సి కఠిన కసరత్తులు చేశారు. అథ్లెట్ బాడీ కోసం ఆమె జిమ్ లో గంటల తరబడి శ్రమించారు.  

హీరోయిన్ తాప్సి కెరీర్ ప్రస్తుతం పీక్స్ లో ఉంది. ఆమె బాలీవుడ్ లో వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం తాప్సి రష్మీ రాకెట్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో రష్మీ ప్రొఫెషనల్ రన్నర్ గా కనిపించనున్నారు. ఈ మూవీ కోసం తాప్సి కఠిన కసరత్తులు చేశారు. అథ్లెట్ బాడీ కోసం ఆమె జిమ్ లో గంటల తరబడి శ్రమించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred


ఐడెంటిటీ కోసం తపించే స్పోర్ట్స్ విమెన్ గా తాప్సి ఈ చిత్రంలో కనిపించనున్నారు. దర్శకుడు ఆకర్ష్ ఖురానా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రష్మీ రాకెట్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. కాగా రష్మీ రాకెట్ మూవీ సెట్స్ నుండి ఓ ఫోటో తాప్సి పంచుకున్నారు. నటుడు ప్రియాన్షు పెయిన్యులి తో తాప్సి హ్యాపీ మూమెంట్ ని ఆమె షేర్ చేయడం జరిగింది. 

అలాగే ఆ ఫోటో అరుదైనదిగా తాప్సి అభివర్ణించారు. ప్రియాన్షు రష్మీ రాకెట్ మూవీలో తాప్సి భర్త పాత్ర చేస్తున్నారు. సూట్ లో ప్రియాన్షు జెంటిల్ లుక్ లో దర్శనం ఇవ్వగా... తాప్సి పన్ను ట్రెడిషనల్ శారీలో కనిపించారు. తాప్సి సోషల్ మీడియాపోస్ట్ వైరల్ అవుతుంది. 

View post on Instagram