ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి రెండేళ్లు కష్టపడి చేసిన సైరా నరసింహా రెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో ఎప్పుడు లేని విధంగా సైరా సినిమాను తెలుగుతో పాటు తమిళ్ - మలయాళం కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఆ సినిమా యూఎస్ ప్రీమియర్ కొద్దిసేపటి క్రితమే  ముగిసింది. 

ఆ టాక్ విషయానికి వస్తే.. సినిమా మొదటి నుంచి చివరివరకు దర్శకుడు సురేందర్ రెడ్డి హిస్టారికల్ కంటెంట్ మిస్సవ్వకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ ని కూడా ని కూడా యాడ్ చేసినట్లు అర్ధమవుతోంది. 171నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైందిపవన్ కళ్యాణ్ - అనుష్కా శెట్టి -సన్నివేశాలతో మొదలయ్యే సన్నివేశాలు సైరా పై ఒక తెలియని ఫీల్ ని కలుగజేస్తారు. 

ఎమోషనల్ సీన్స్ అనంతరం సినిమా పూర్తయ్యింది. ఫైనల్ గా సినిమా మెగా ఫ్యాన్స్ కి మంచి కిక్కిచ్చే సినిమా అవుతుందని చెప్పవచ్చు. యాక్షన్ సీన్స్ అలాగే ఎమోషనల్ సీన్స్ సినిమా స్థాయిని పెంచాయి, ఇకపోతే కొన్ని దేశభక్తి సన్నివేశాలు అనుకున్నంతగా క్లిక్కవ్వలేదు అనే భవన కలుగుతుంది. పెద్దగా అంచనాలు లేకుండా అన్ని వర్గాల ఆడియెన్స్ కి అందరికి సినిమా నచ్చే అవకాశం ఉంది. 

మొదటివారం సినిమా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉంది  తమిళ్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. మరి లోకల్ ఆడియెన్స్ సైరా నరసింహా రెడ్డిని ఎంతగా ఇష్టపడతారో చూడాలి. కెమెరా పనితనం కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ సినిమా కథలో లీనమై కనిపిస్తాయి. అలాగే అమితాబ్ నుంచి నయనతార వరకు అందరూ సినిమాలో అద్భుతంగా నటించారు.