మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్ర ప్రీమియర్ షోలు దుబాయ్, యుఎస్ లలో మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా సైరా స్పెషల్ షోలని ప్రదర్శించనున్నారు. కర్నూలు ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారితో పోరాడిన తొలి తెలుగు యోధుడు. 

చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రంలో చిరంజీవి నటించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వసూళ్లపరంగా సైరా చిత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 

యూఎస్ లో సైరా చిత్ర వసూళ్ల జోరు ప్రారంభమైంది. యూఎస్ లోకల్ టైం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల వరకు 229 లొకేషన్స్ లో సైరా ప్రీమియర్ వసూళ్లు హాఫ్ మిలియన్ మార్క్ ని అధికమించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సైరా చిత్రం 5,02,000 డాలర్ల వసూళ్లు రాబట్టింది. 

యుఎస్ మొత్తం ప్రీమియర్ వసూళ్లు మిలియన్ మార్క్ ని అందుకునే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. తదుపరి వసూళ్ల వివరాలు త్వరలో తెలియనున్నాయి.