ప్రస్తుతం మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రం సైరా సినిమా రిలీజ్ దగ్గరపడుతోంది. ప్రమోషన్స్ వేగం పెంచుతున్నారు. అందులో భాగంగా  చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా చేసి ప్రాజెక్టుకు ఊపు  తేబోతున్నారు దర్శక,నిర్మాతలు.  కర్నూల్ లో ఈ నెల 18న సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరపడానికి సన్నాహాలు చేసింది చిత్ర యూనిట్. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూల్ లోనే జన్మించడంతో అక్కడే ఈ చిత్ర ఈవెంట్ జరపాలని నిర్మాతలు భావించారు. అయితే లాస్ట్ మినిట్ లో  వెన్యూ ఛేంజ్ చేసినట్లు సమాచారం సమాచారం. అందుకు కారణం ..వాతావరణ పరిస్దితులు అని తెలుస్తోంది.

కర్నూలలో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తూండటంతో ఈవెంట్ అవి ఇబ్బందిగా మారతాయని నిర్మాతలు భావించి ఈ వెన్యూ మార్పు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దాంతో కర్నూలు నుంచి హైదరాబాద్ గచ్చి బౌలి ఇండోర్ స్టేడియం కు వెన్యూ మార్చారు.  

అయితే ఈ వెన్యూ ఛేంజ్ వార్తపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. అలాగే వేడుకకు ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ రానున్నారనే వార్తలపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. దాదాపు రూ.270 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు.  ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం భారీ ఎత్తున జరుగుతోంది.  

 సౌతిండియా లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నటించింది. తమన్నా కూడా ఈ సినిమాలో నర్తకి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ,కన్నడ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేయనున్నారు. ఆయా భాషల్లో క్రేజ్ తీసుకువచ్చేందకు ఇప్పటికే ఆయా భాషలకు చెందిన నటీనటులతో సినిమాకు వాయిస్ – ఓవర్ ఇప్పించారంట. తెలుగులో పవన్ కళ్యాణ్, తమిళ లో రజినీకాంత్, మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో యశ్, హిందీలో అమితాబ్ బచ్చన్ ‌ఉయ్యాలవాడ గురించి సినిమాలో చెబుతారట.