బిగ్‌బాస్‌4 నాల్గో వారంలో ఇప్పటి వరకు ఏమాత్రం పసలేదు. సో.. సో గా సాగుతుంది. హాడావుడి చేసిన అవినాష్‌ సైలెంట్‌ అయ్యాడు. స్వాతి హడావుడి తగ్గింది. దీంతో ఇప్పుడు గేమ్‌లతో హీట్‌ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్‌బాస్‌. కాయిన్స్ గేమ్‌ కోసం అందరు కొట్టుకుంటున్నారు. ఒకరి కాయిన్స్ ని మరొకరు దొంగలిస్తున్నారు. ఈ క్రమంలో సోహైల్‌, అరియానా, హారిక వంటి వారి మధ్య పెద్ద దుమారే రేగింది. 

మరోవైపు బిగ్‌బాస్‌4 హౌజ్‌లో ఈ వారం గ్లామర్‌ డోస్‌ పెంచారు. స్వాతి దీక్షిత్‌ వచ్చి అందరి వద్ద పులిహోర కలుపుతుంది. ఇక అభిజిత్‌, అఖిల్‌, అవినాష్‌, అమ్మరాజశేఖర్‌, సోహైల్‌ ఇలా అంతా స్వాతిపై పడ్డారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆమెని ఇంప్రెస్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే స్వాతి రావడంతో మోనాల్‌ సైలెంట్‌ అయిపోయింది. మూడు వారాలపాటు హౌజ్‌ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ఊపుఊపిన మోనాల్‌.. స్వాతి గ్లామర్‌ దెబ్బకి తట్టుకోలేకపోతుంది. గిలగిల కొట్టుకుంటుంది. మరోవైపు తన వెంట పడ్డ అభిజిత్‌, అఖిల్‌ సైతం మోనాల్‌ని పక్కన పెట్టేశారు. వీరిద్దరు స్వాతివైపే తిరుగుతున్నారు. ఇక అంతకు ముందు సైలెంట్‌గా ఉన్నా సుజాత్‌, అరియానా, దివి సైతం రెచ్చిపోతున్నారు. సాధ్యమైనంత వరకు ఎఫైర్స్ పెట్టుకునేందుకు ట్రై చేస్తున్నారు. ఎలాగూ అవినాష్‌.. అరియానాని గోకుతున్నారు. 

అయితే ఈ మొత్తంలో మోనాల్‌ ఒంటరైపోయిందన్న భావన కలుగుతుంది. అఖిల్‌, అభిజిత్‌ ఫ్లేట్‌ ఫిరాయించడంతో అవాక్కయ్యింది. స్వాతి దీక్షిత్‌ గ్లామర్‌ కింద తాను హైలైట్‌ కాలేకపోతుంది. అదే సమయంలో స్వాతిపై లోలోపల కుమిలిపోతుందని అర్థమవుతుంది. ఇక కొత్తగా మోనాల్‌..నోయల్‌తో చనువుగా ఉంటుంది. 23వ రోజు ఏకంగా నోయల్‌ని గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టినంత పనిచేసింది. మొత్తంగా ఎవరికి వారు లవ్‌ ఎఫైర్స్ తో బిజీగా ఉన్నారు.