Asianet News TeluguAsianet News Telugu

'సువర్ణ సుందరి' రిలీజ్ డేట్ ఫిక్స్!

పూర్ణ, సాక్షి చౌదరి, జయప్రద ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న చిత్రం "సువర్ణసుందరి".   

suvarna sundari movie release date locked
Author
Hyderabad, First Published May 1, 2019, 3:08 PM IST

పూర్ణ, సాక్షి చౌదరి, జయప్రద ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న చిత్రం "సువర్ణసుందరి".   సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న క్యాప్షన్ తో    భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని  రీతిలొ ఓ  సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై
ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న  ఈ చిత్రం మే 31న  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా..

డైరెక్ట‌ర్ సూర్య మాట్లాడుతూ.. ''సువర్ణ సుందరి  చిత్రంలో  ఎఫ్ఎక్స్ కోసం ఏడాదిపాటు  వ‌ర్క్ జ‌రిగింది. టైమ్ తీసుకున్నా ఔట్పుట్ మాత్రం అద్భుతంగా వ‌చ్చింది.గత కొంతకాలంగా తెలుగులో స్క్రీన్  ప్లే బేస్డ్ సినిమాలకు ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాను సైతం మూడు జన్మల కాన్సెప్ట్ తో ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లే తో రూపొందిచాము. ఆడియెన్స్ ఆకట్టుకోవటంతో పాటు ,కమర్షియల్‌ గా పక్కా హిట్ కొడతామన్న నమ్మంకంతో ఉన్నామన్నారు''. 

నిర్మాత లక్ష్మీ మాట్లాడుతూ..‌ ''ఈ చిత్రం సెన్సార్ కు సిద్దమయింది. తెలుగు ,కన్నడ ,తమిళ్ భాషల్లొ మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయటానికి  సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios