బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌ను పెళ్లాడనున్నట్లు ప్రకటించారు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ. ఈ మేరకు ఆమెతో క్లోజ్ గా వున్న ఫోటోలను ఆయన పోస్ట్ చేశారు. 

ఐపీఎల్ సృష్టికర్త, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (indian premier league) మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ (lalit modi) తాను మరోసారి పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌ను (sushmita sen) తాను పెళ్లాడబోతున్నట్లు ఆయన వెల్లడించారు. కానీ ఆ వెంటనే ప్రస్తుతానికి పెళ్లి చేసుకోవడం లేదని.. డేటింగ్‌లో వున్నట్లు తెలిపారు. కానీ ఏదో ఒక రోజు వివాహం జరిగి తీరుతుందని లలిత్ మోడీ స్పష్టం చేశారు. మాల్దీవులు, సార్డియానా పర్యటనలను ముగించుకుని లండన్‌లో ల్యాండైనట్లు ఆయన తెలిపారు. తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నానని.. జీవిత భాగస్వామి సుస్మితా సేన్‌తో కలిసి కొత్త జీవితం ప్రారంభించబోతున్నందుకు ఆనందంగా వుందని లలిత్ అన్నారు. వీరిద్దరూ క్లోజ్‌గా వున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా.. సుస్మితా సేన్‌ గతంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ తో ప్రేమలో పడ్డారు. అనంతరం ఇద్దరూ కలసి జీవించడం మొదలుపెట్టారు. అయితే సుస్మిత అప్పట్లో సినిమాలు, మోడలింగ్ తో బిజీగా వుండటంతో అనతికాలంలోనే వీరి బంధం బీటలు వారింది. ఆ తర్వాత ప్రముఖ మోడల్ రోహ్‌మన్ తోనూ ప్రేమాయణం సాగించారు. కానీ అది కూడా నిరాశనే మిగిల్చింది. 

1994లో మిస్ యూనివర్స్ కిరీటం గెలిచారు సుస్మితా సేన్. అనంతరం వరుస ఆఫర్లు రావడంతో 1996లో దస్తక్ అనే సినిమాతో బాలీవుడ్ లో ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బీబీ నంబర్ 1, ఫిజా, ఆంఖే, మై హోనా, మైనే ప్యార్ క్యూ కియా లాంటి సినిమాల్లో నటించారు. తర్వాత కొన్నేళ్ల పాటు నటనకు దూరంగా వున్న సుస్మితా సేన్.. 2020లో డిస్నీ హాట్ స్టార్ తెరకెక్కించిన ఆర్య వెబ్ సిరీస్ తో దేశ ప్రజలను పలకరించారు. 

Scroll to load tweet…