Asianet News TeluguAsianet News Telugu

'భోళా శంకర్'లో సుశాంత్ -ఏ క్యారక్టర్ లో అంటే...

 సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన 'భోళా శంకర్' సినిమాలో నటిస్తున్నట్లు చిత్ర టీమ్ వెల్లడించింది. దాంతో ఇప్పుడు సుశాంత్ ఏ పాత్ర చేయబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. 

Sushanth playing Keerthy Suresh love interest role in #BholaaShankar
Author
First Published Mar 18, 2023, 1:37 PM IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'భోళా శంకర్' . మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో   నాగార్జున మేనల్లుడు సుశాంత్  నటిస్తున్నారు. ఈ రోజు ఆ విషయాన్ని టీమ్ అఫీషియల్ గా ప్రకటించింది.   సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన 'భోళా శంకర్' సినిమాలో నటిస్తున్నట్లు చిత్ర టీమ్ వెల్లడించింది. దాంతో ఇప్పుడు సుశాంత్ ఏ పాత్ర చేయబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. 

అందుతున్న సమాచారం మేరకు... 'భోళా శంకర్'లో లవర్ బాయ్ తరహా పాత్రలో సుశాంత్ కనిపించనున్నారని చిత్ర టీమ్ తెలిపింది. ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. ఆమెకు జోడీగా సుశాంత్ కనిపిస్తారని అంటున్నారు.  ఇక సుశాంత్ హీరోగా తగ్గించి ఇలాంటి కీ రోల్స్ లో బిజీ అవుతున్నారు. అల్లు అర్జున్ హీరోగా చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో సుశాంత్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు పడ్డాయి. దాంతో  ఇప్పుడు మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రావణాసుర’ చిత్రంలోనూ సుశాంత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజతో పాటు సుశాంత్ పాత్ర కూడా సినిమాలో కీలకంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఇక  భోళాశంకర్ సినిమాలో సుశాంత్‌కు ఓ మంచి పాత్ర అంటున్నారు. చిరు చెల్లి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఆమె ప్రియుడి పాత్రలో సుశాంత్ కనిపించబోతున్నాడట. అయితే తమిళంలో ఈ పాత్ర లెంగ్త్ చాలా తక్కువ. కానీ, తెలుగులో సుశాంత్ కోసం ఈ పాత్ర నిడివిని పెంచినట్లు సమాచారం.  

 ‘భోళాశంకర్’ సినిమాతో చిరు మరోసారి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ తరువాత చిరు నటిస్తున్న సినిమా కావడంతో భోళాశంకర్ మూవీ కూడా ఖచ్చితంగా విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండగా, తమిళ చిత్రం ‘వేదాలం’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా రానుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios