జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఇటీవల విడుదలైన ప్రభాస్ సాహో చిత్రంలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. బ్యాడ్ బాయ్ అంటూ సాగే పాటలో జాక్వెలిన్ ఏ రేంజ్ లో అందాలు ఆరబోసిందో అందరికి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో యువ హీరో సుశాంత్ సింగ్ కు మంచి క్రేజ్ ఉంది. 

ఎంఎస్ ధోని చిత్రంతో దేశవ్యాప్తంగా సుశాంత్ పాపులర్ అయ్యారు. ప్రస్తుతం జాక్వెలిన్, సుశాంత్ జంటగా డ్రైవ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. తరుణ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో ఛేజింగ్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయంటూ చిత్ర యూనిట్ మొదటి నుంచి చెబుతోంది. 

కానీ ఈ చిత్రం పలు సందర్భాల్లో వాయిదా పడింది. షూటింగ్ కూడా చాలా ఆలస్యంగా జరిగింది. ఓ సందర్భంలో అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ కూడా ప్రచారం జరిగింది. దీనితో ఈ చిత్రానికి ఏర్పడాల్సిన బజ్ పూర్తిగా దెబ్బ తింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నించినా ఊహించని షాక్ ఎదురైంది. 

ఎలాంటి బజ్ లేకపోవడంతో బయ్యర్లు ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు. దీనితో ఈ చిత్రాన్ని థియేటర్స్ లో కాకుండా నెట్ ఫ్లిక్స్ లాంటి డిజిటల్ మీడియాలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఘాటుగా అందాలు ఆరబోసినట్లు తెలుస్తోంది. డ్రైవ్ చిత్రానికి జాక్వెలిన్ గ్లామర్ కూడా పనిచేయలేదు. సుశాంత్ తో కలసి జాక్వెలిన్ బికినిలో ఉన్న స్టిల్స్ వైరల్ అవుతున్నాయి.