Asianet News TeluguAsianet News Telugu

శిరీష్ ప్రస్తావన రాగానే ఇబ్బంది పడిపోయాడు!

బందోబస్త్ సినిమా విడుదలకు సిద్ధమైంది. సూర్య హీరోగా నటించిన ఈ సినిమాలో ఆర్య ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. అయితే లెక్క ప్రకారం ఆ పాత్రను అల్లు శిరీష్ చేయాలి. కానీ కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేయలేక తప్పుకున్నాడు. 
 

surya reacts on Allu sirish exit from bandobast movie
Author
Hyderabad, First Published Sep 16, 2019, 9:37 AM IST

సూర్య హీరోగా నటించిన 'బందోబస్త్' సినిమా విడుదలకు సిద్ధమైంది. మోహన్ లాల్, ఆర్య ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాలో సాయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. నిజానికి ఈ సినిమాలో ఆర్య పాత్రలో అల్లు శిరీష్ నటించాల్సివుంది. కానీ కాల్షీట్స్ అడ్జస్ట్ చేయలేక తాను 'బందోబస్త్' సినిమా నుండి తప్పుకుంటున్నట్లు అల్లు శిరీష్ గతంలో ప్రకటించాడు.

ఇప్పుడు ఆ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి శిరీష్ తప్పుకున్న విషయంపై సూర్య స్వయంగా స్పందించాల్సి వచ్చింది. కానీ ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడ్డాడు. సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన సూర్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడికి అల్లు శిరీష్ ఎందుకు తప్పుకున్నాడనే ప్రశ్న ఎదురైంది.

దానికి సూర్య ఇబ్బంది పడుతూ కొన్ని పేపర్ ఇష్యూల కారణంగా, ఆఖరి నిమిషంలో మార్పుల చేర్పుల వలన శిరీష్ ఈ సినిమా చేయలేకపోయాడని చెప్పాడు. మరికొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయని చెప్పుకొచ్చాడు. అల్లు శిరీష్ చెప్పినట్లుగానే కాల్షీట్స్ సమస్య వలన ఈ సినిమాలో నటించలేకపోయాడని సూర్య చెబితే సరిపోయేది కానీ పేపర్ ఇష్యూలంటూ ఏదేదో మాట్లాడాడు.

నిజానికి ఈ సినిమా నుండి శిరీష్ తప్పుకోలేదు. యూనిట్ సభ్యులే అతడిని తప్పించారని టాక్. నిజానికి ఆ సమయంలో అల్లు శిరీష్ అంత బిజీగా కూడా లేరు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సాయేషా తన భర్త ఆర్యని రికమండ్ చేసిందని ఆ కారణంగానే అల్లు శిరీష్ ని తప్పించారని ఇండస్ట్రీ టాక్. 

Follow Us:
Download App:
  • android
  • ios