Asianet News TeluguAsianet News Telugu

షూటింగ్ లో ఏడ్చిన సాయి పల్లవి.. ఓదార్చిన సూర్య!

ప్రేమమ్ - ఫిదా సినిమాలతో ఒక్కసారిగా సౌత్ ని ఆకర్షించిన బ్యూటీ సాయి పల్లవి. వరుసగా ఆఫర్స్ అందుకుంటూ తనదైన శైలిలో ట్రెండ్ సెట్ చేస్తోన్న అమ్మడు రౌడీ బేబీ సాంగ్ తో మరో స్థాయికి చేరుకుంది. మారి 2 సినిమా హిట్టవ్వకపోయినా ఆ సినిమా సాంగ్ లో సాయి పల్లవి డ్యాన్స్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. 

surya comments on sai pallavi behaviour
Author
Hyderabad, First Published May 5, 2019, 11:15 AM IST

ప్రేమమ్ - ఫిదా సినిమాలతో ఒక్కసారిగా సౌత్ ని ఆకర్షించిన బ్యూటీ సాయి పల్లవి. వరుసగా ఆఫర్స్ అందుకుంటూ తనదైన శైలిలో ట్రెండ్ సెట్ చేస్తోన్న అమ్మడు రౌడీ బేబీ సాంగ్ తో మరో స్థాయికి చేరుకుంది. మారి 2 సినిమా హిట్టవ్వకపోయినా ఆ సినిమా సాంగ్ లో సాయి పల్లవి డ్యాన్స్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. 

అయితే యాక్టింగ్ పై బేబీకి ఉన్న అబీకితభావాన్ని గురించి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య తెలిపాడు. సాయి పల్లవి సూర్యతో కలిసి NGKలో నటించిన సంగతి తెలిసిందే. సెల్వ రాఘవన్ ఆ సినిమాకు దర్శకుడు. అయితే సినిమాలో కొన్ని సీన్స్ కి సాయి పల్లవి చాలా టెక్స్ తీసుకందట. 

ఒకానొక సమయంలో రోజు ఆమె వల్ల ఇతరులకు సంబందించిన సీన్స్ ఆలస్యం అయ్యేవి. దీంతో షూటింగ్ కూడా ఆలస్యం అవుతుండడంతో సాయి పల్లవి కొన్నిసార్లు కన్నీరు పెట్టుకుందట. ఆమె ఏడుస్తుంటే ఓదార్చినట్లు సూర్య తెలిపారు. సాయి పల్లవి మంచి నటి అని చెబుతూ.. ఎక్కువ టెక్స్ తీసుకొని సీన్స్ లో బాగా నటించినప్పటికీ సంతృప్తిగా ఉండేవారు కాదని అన్నారు. ఆ విధంగా సాయి పల్లవి బాధపడటం చూస్తే నటనపై ఆమెకున్న ఇష్టం అందరికి అర్థమైందని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios