Asianet News TeluguAsianet News Telugu

ఈ వయస్సులో సూర్య-జ్యోతిక రొమాంటిక్ టూర్, విడాకుల వార్తలకు చెక్ పెట్టిన జంట

చాలా కాలంగా షికారు చేస్తున్న విడాకుల వార్తలకు చెక్ పెట్టారు సూర్య, జ్యోతిక. ఓ రొమాంటిక్ టూర్ వీడియోతో అందరి నోర్లు మూయించారు.

Surya and Jyothika Romantic Finland Tour Video Viral JMS
Author
First Published Jan 30, 2024, 2:00 PM IST

చాలా కాలంగా తమిల స్టార్స్ సూర్య , జ్యోతికల పర్సనల్ లైఫ్ కు సబంధించిన వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. వీరు విడిపోతున్నారని. త్వరలో విడాకులు తీసుకుంటున్నారి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లే ముంబయ్ కు షిప్ట్ అయ్యారని. అక్కడ కూడా విడిగా ఉంటున్నారని. పిల్లల కోసం కలిసి ఉంటున్నట్టు నటిస్తున్నారని..ఇలా ఎన్ని యాంగిల్స్ లో వైరల్ అవ్వాలో అన్ని యాంగిల్స్ లో న్యూస్ వైరల్ అవతూ వచ్చింది. తాజాగా ఈ వార్తలకు చెక్ పెడుతూ.. అందరి నోర్లు మూయించారు ఈ స్టార్ జంట. 

నోటిత ఏమీ చెప్పకుండా.. అడ్డమైన ప్రకటనలు చేయకుండా..ఒకే  ఒక వీడియోతో అందరికి సమాధానం చెప్పారు తమిళ స్టార్ కపుల్. ఈ వయస్సులో 50 ఏళ్లకు దగ్గరగా ఉన్న సూర్య.. 45 ఏళ్ళ వయస్సులో జ్యోతికా.. ఇద్దరు కలిసి రొమాంటిక్ టూర్ వేశారు.మంచి మంచు ప్రదేశాంలో.. వేడి వేడి టైమ్ ను స్పెండ్ చేస్తూ.. ఏకాంతంగా టైమ్ ను గడిపారు సూర్య, జ్యోతిక.  ఇక వీరు న్యూ ఇయర్ కోసం ఫిన్లాండ్ వెళ్ళినట్టు తెలుస్తోంది. 

Surya and Jyothika Romantic Finland Tour Video Viral JMS

అక్కడ మంచుదుప్పట్లో అల్లరి చేస్తూ.. వారు చేసిన టూర్ కు సబంధించిన వీడియోలన్నీ కలిపి ఓ వీడియోగా మార్చి.. ప్రోమోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.  దాంతో వీరి విడాకుల వార్తలకు చెక్ పెట్టినట్టు అయ్యింది. వెకేషన్‌కు వెళ్లిన జ్యోతిక – సూర్య దంపతులు అక్కడి మంచు వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎప్పుడూ షూటింగ్స్‌, ప్రొమోషన్స్‌, ఫ్యామిలీ, పిల్లలు అంటూ తీరిక లేకుండా ఉండే ఈ జంట.. తన బిజీ లైఫ్‌ను పక్కన పెట్టి విలువైన సమయాన్ని సరదాగా గడుపుతున్నారు. గట్టకట్టే చలిలో మంచుతో ఆటలు ఆడుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jyotika (@jyotika)

అంతే కాదు ఈ టూర్ వారికి పర్సనల్ టూర్ అని తెలుస్తోంది.  పిల్లలు దియా, దేవ్‌ లేకుండానే వారు వెకేషన్‌కు వెళ్ళారు. ఇందుకు సంబంధించిన క్యూట్‌ వీడియోని జ్యోతిక తన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో షేర్‌ చేసుకుంది. ‘ప్రయాణంతో నిండిన ఏడాది 2024.. అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ వీడియోవైరల్ అవ్వడంతో నెట్టింట రకరకాల కమెంట్లు పెడుతున్నారు. ఇక వీరి విడాకుల వార్తలు వైరల్ చేసిన వారు ఏం స్పందించాలో తెలిక కామ్ అయిపోయారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios