Asianet News TeluguAsianet News Telugu

దళపతి విజయ్ విగ్రహం ఏర్పాటు చేసిన ఫ్యాన్స్!

కర్ణాకట రాష్ట్రంలోని మంగళూరుకు చెందిన విజయ్ ఫ్యాన్స్ ఆయన నిలువెత్తు విగ్రహాన్ని రూపొందించారు. విజయ్ విగ్రహాన్ని చెన్నైకి తీసుకు వచ్చి బహుమతిగా ఇచ్చారు. 

surprising gift from fans to hero vijay erects his statue ksr
Author
Hyderabad, First Published Jul 26, 2021, 3:54 PM IST

సినిమా హీరోలపై ఫ్యాన్స్ కి ఉండే అభిమానానికి కొలమానం కూడా లేదని చెప్పాలి. ముఖ్యంగా సౌత్ ఇండియాలో అభిమాన హీరోలను ఫ్యాన్స్ దేవుడు లెక్క పూజిస్తారు. సౌత్ ఇండియాలో భారీ ఫేమ్ కలిగిన తలపతి విజయ్ కి ఫ్యాన్స్ అపూర్వమైన గిఫ్ట్ ఇచ్చారు. ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి, బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 


కర్ణాకట రాష్ట్రంలోని మంగళూరుకు చెందిన విజయ్ ఫ్యాన్స్ ఆయన నిలువెత్తు విగ్రహాన్ని రూపొందించారు. విజయ్ విగ్రహాన్ని చెన్నైకి తీసుకు వచ్చి బహుమతిగా ఇచ్చారు. సదరు విగ్రహాన్ని విజయ్ మక్కల్ ఇయక్కమ్ పన్నైయూర్ కార్యాలయంలో శాశ్వతంగా ఏర్పాటు చేయనున్నారట. ఇక విజయ్ విగ్రహం రూపొందించారన్న వార్త తెలుసుకున్న విజయ్ అభిమానులు , ఆ విగ్రహం చూడడానికి పోటెత్తున్నట్లు సమాచారం. 


రజినీకాంత్ తరువాత ఆ స్థాయి ఫేమ్ తెచ్చుకున్న హీరోగా విజయ్ నిలిచాడు. ఆయన వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ రికార్డ్స్ నమోదు చేస్తున్నారు. విజయ్ లేటెస్ట్ మూవీ మాస్టర్ మిక్స్డ్ టాక్ తెచ్చుకొని కూడా, భారీ వసూళ్లు రాబట్టింది. తెలుగులో కూడా విజయ్ సినిమాలు మంచి వసూళ్లు రాబడుతున్నాయి. ప్రస్తుతం విజయ్ బీస్ట్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీలో విజయ్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios