దిల్ రాజు కొత్త ట్రెండ్,సూర్యని సైతం సీన్ లోకి

నిర్మాత దిల్ రాజు చాలా వరకు  తమిళ,తెలుగు కాంబినేషన్  కు ప్రయారిటీ ఇస్తున్నారు. ఆయన భారీ బడ్జెట్ లతో ప్రాజెక్టులు లైన్ లో పెడుతున్నారు. 

Suriyas First Straight Telugu Film with Dil raju? jsp

సీనియర్ నిర్మాత దిల్ రాజు తమిళ స్టార్ హీరో విజయ్ తో తెలుగులో డైరక్ట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి సంభందించి ఇప్పటికే కథా చర్చలు  జరుగుతున్నాయి. త్వరలోనే ప్రాజెక్టుపై అఫీషియల్ ప్రకటన రాబోతోంది. ఈ నేపధ్యంలో  దిల్ రాజు మరో డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. తమిళ స్టార్ హీరో సూర్యని సైతం తెలుగులో స్ట్రైయిట్ సినిమాకు ఒప్పించారట.

తమిళ్ హీరో సూర్య కి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. గజిని సినిమా నాటి నుండి తెలుగులో హిట్ ,ప్లాఫ్ లకు సంబంధం లేకుండా వరస సినిమాలతో సూర్య సత్తా చాటుతూ ఉన్నాడు. దానికి తోడు చాలా స్పష్టంగా కూడా సూర్య తెలుగు మాట్లాడుతారు.ఈనేపథ్యంలో ఎప్పటినుండో సూర్య స్ట్రైయిట్ తెలుగు ఫిలిం ఒకటి చేయాలని ప్లాన్లు చేస్తున్నారు. ఇంతకాలానికి సూర్య కల నెరవేరబోతోంది.  టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో టాప్ నిర్మాత దిల్ రాజు సారథ్యంలో సినిమా చేయడానికి సూర్య ఒప్పుకున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని పాన్ ఇండియా తరహాలో… తెరకెక్కించాలని సూర్య మరియు డైరెక్టర్ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.

ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయిందని.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు  వినపడుతోంది. ఇక నిర్మాత దిల్ రాజు చాలా వరకు  తమిళ,తెలుగు కాంబినేషన్  కు ప్రయారిటీ ఇస్తున్నారు. ఆయన భారీ బడ్జెట్ లతో ప్రాజెక్టులు లైన్ లో పెడుతున్నారు.   రామ్ చరణ్ ..శంకర్ కాంబినేషన్ అందులో ఒకటి. ఆ తర్వాత విజయ్,వంశీ పైడిపల్లి, ఇప్పుడు బోయపాటి,సూర్య సినిమాలు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios