Asianet News TeluguAsianet News Telugu

సూర్య ‘బందోబస్త్’ కథ లీక్!

హీరో సూర్య స్పెషల్ ప్రొటక్షన్ పోర్స్ లో పని చేస్తుంటాడు. అతను ఓ గూఢచారిగా ప్రధానిని టార్గెట్ చేసే వారిని ట్రేస్ చేసి, వాళ్ల గ్రూప్ లో చేరుతాడు. ఆ విషయం వాళ్లకు ఎలా తెలుస్తుంది. హీరో ఎలా ప్రధానిని సేవ్ చేసాడు..అసలు విలన్ ఎవరు అనే నేపధ్యంలో జరిగే కథ. 

Suriya's Bandobast  Story Leaked?
Author
Hyderabad, First Published Aug 20, 2019, 1:55 PM IST

 

తమిళ  స్టార్ హీరో.. ‘గజిని’, ‘సింగం’ సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సూర్య హీరోగా నటిస్తున్న డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ‘బందోబస్త్’. ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వం వహించారు. తమిళ సినిమా ‘కాప్పాన్’కు తెలుగు అనువాదమిది.  ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం టీజర్ ఆసక్తికరంగా ఉంది. డిఫరెంట్ గెటప్పుల్లో సూర్య నటన, పాకిస్తాన్‌ తీరును ఎండగడుతూ మోహ‌న్‌లాల్‌ చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌, కథా నేపథ్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలను టీజర్ మరింత పెంచింది.   దాంతో చిత్రం కథ ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది.

తమిళ సినిమా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... ఈ సినిమాలో ప్రధాన మంత్రి ని చంపటానికి ఓ గ్రూప్ ప్లాన్ చేస్తుంది.  హీరో సూర్య స్పెషల్ ప్రొటక్షన్ పోర్స్ లో పని చేస్తుంటాడు. అతను ఓ గూఢచారిగా ప్రధానిని టార్గెట్ చేసే వారిని ట్రేస్ చేసి, వాళ్ల గ్రూప్ లో చేరుతాడు. ఆ విషయం వాళ్లకు ఎలా తెలుస్తుంది. హీరో ఎలా ప్రధానిని సేవ్ చేసాడు..అసలు విలన్ ఎవరు అనే నేపధ్యంలో జరిగే కథ. 

తెలుగు ప్రేక్షకులకు ‘నవాబ్’, విజువల్ వండర్ ‘2.0’ చిత్రాలు అందించిన లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు. సూర్య సరసన సాయేషా సైగల్ నటిస్తున్న ఈ సినిమాలో భారత ప్రధానిగా మలయాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌, కీలక పాత్రలో ఆర్య నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నట్టు చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. తెలుగులో సూర్యకు స్టార్ ఇమేజ్ రావడానికి పునాది వేసిన ‘గజిని’ సెప్టెంబర్ లో విడుదల కావడం విశేషం.

సూర్య, మోహన్ లాల్, బోమన్ ఇరానీ, ఆర్య, సాయేషా సైగల్, సముద్రఖని, పూర్ణ, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు - ఫణి కందుకూరి, రైటర్: పి.కె.పి & శ్రీ రామకృష్ణ, లిరిక్స్: వనమాలి, చంద్రబోస్, ఆర్ట్ డైరెక్టర్: డి.ఆర్.కె. కిరణ్, ఎడిటర్: ఆంటోనీ, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, పీటర్ హెయిన్స్, డాన్స్: బాబా భాస్కర్, శోభి, గణేష్ ఆచార్య, సినిమాటోగ్రఫీ: ఎం.ఎస్. ప్రభు, సంగీతం: హేరీశ్ జైరాజ్, నిర్మాత: సుభాస్కరణ్, దర్శకత్వం: కె.వి. ఆనంద్.

Follow Us:
Download App:
  • android
  • ios