Asianet News TeluguAsianet News Telugu

Tollywood Updates: ఎమోషనల్ అయిన సూర్య, ఆసక్తికరంగా ‘ఇన్స్ పెక్టర్ రిషి’, ‘భరతనాట్యం’, ‘తెప్పసముద్రం’ అప్డేట్స్

‘కంగువా’ చిత్రంలో నటించడం పట్ల తమిళ స్టార్ సూర్య (Suriya) ఎమోషనల్ కామెంట్స్ చేశారు... టాలీవుడ్ చిత్రాలు ఇన్స్ పెక్టర్ రిషి, తెప్ప సముద్రం, భరతనాట్యం నుంచి ఈరోజు వచ్చిన అప్డేట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.

Suriya Comments on Kanguva and Movies Updates Here NSK
Author
First Published Mar 24, 2024, 10:45 PM IST

'కంగువ' (Kanguva) లాంటి గొప్ప సినిమాలో నటించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు తమిళ స్టార్ హీరో సూర్య. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. తాజాగా ముంబైలో 'కంగువ' గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. 

ఈ కార్యక్రమంలో హీరో సూర్య పాల్గొని ఎమోషనల్ గా మాట్లాడారు. ‘గొప్ప సినిమాల్లో నటించే అవకాశం అదృష్టవశాత్తూ దక్కుతుంటుంది. మన కోరికను ఈ యూనివర్స్ విని అది జరిగేలా చేస్తుందని నమ్ముతాను. అది కంగువ విషయంలోనూ జరిగింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి రోజు రోజుకూ మూవీ మరింత బిగ్ ప్రాజెక్ట్ గా మారుతూ వచ్చింది. అందుకు మా డైరెక్టర్ శివ, ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాకు కృతజ్ఞతలు. అలాగే సినిమాటోగ్రాఫర్ వెట్రి, మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ లేకుండా ఈ మూవీ ఇంత బాగా వచ్చేది కాదు. నటుడిగా పాతికేళ్ల అనుభవం  తర్వాత ఒక సినిమాకు ఎగ్జైట్ అయి వర్క్ చేయడం అంత సులువు కాదు. కంగువకు  150 రోజులకు పైగా చేసిన షూట్ లో ప్రతి రోజూ ఆ ఎగ్జైట్ మెంట్ ఎక్సీపిరియన్స్ చేశామన్నారు.  

నవీచంద్ర ‘ఇన్స్ పెక్టర్ రిషి’ ట్రైలర్..

హీరో నవీన్ చంద్ర (Naveen Chandra) లీడ్ రోల్ లో నటిస్తున్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ *ఇన్స్ పెక్టర్ రిషి’ (Inspector Rishi).  సునైన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారర్ క్రైమ్ కథతో ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు డైరెక్టర్ నందిని జె.ఎస్. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ పై సుఖ్ దేవ్ లాహిరి నిర్మించారు. అమోజాన్ తమిళ్ ఒరిజినల్ గా ఈ నెల 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ తెలుగు ట్రైలర్ ను కాజల్ అగర్వాల్ విడుదలచేసింది. తీన్ కాడు అనే ప్రాంతంలోని అడవిలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యల వెనకున్నరహస్యాన్ని చేధించే పనిలో ఇన్స్ స్పెక్టర్ రిషి ఏమేరకు సక్సెస్ అయ్యాడనేది ట్రైలర్ కథాంశం. థ్రిల్లింగ్ అంశాలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 

‘తెప్పసముద్రం’ సినిమా నుంచి బ్యూటీఫుల్ సాంగ్... 

చైతన్య రావు, అర్జున్ అంబటి హీరోలుగా, కిశోరి దాత్రక్ హీరోయిన్ గా రవిశంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’ (Theppa Samudram). సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై  నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పీఆర్ సంగీత దర్శకుడు. షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందు రాబోతోంది. అయితే ఈ చిత్రం నుంచి పెంచాల దాస్ రాసి, పాడిన ‘నా నల్లా కలువా పువ్వా’ సాంగ్ ను MRT మ్యూజిక్ ద్వారా ఈరోజు విడుదల చేశారు. సాంగ్ ఆకట్టుకుంటోంది.  

ఆసక్తికరంగా ‘భరతనాట్యం’ చిత్ర ట్రైలర్.. 
కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న డార్క్ కామెడీ చిత్రమే ‘భరతనాట్యం’ (Bharathanatyam). ఈ చిత్రంలో సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి ప్రధాన పాత్రలలో నటించారు. హర్ష చెముడు, హర్షవర్ధన్, అజయ్ గోష్, మస్తలి(సలీమ్ ఫేకు), టెంపర్ వంశీ, గంగవ్వ, శివన్నారాయణ, సంతోష్ బాలకృష్ణ, సత్తన్న, కృష్ణ అల్లూరి, నాగ మహేష్, టార్జన్, టార్జన్, మాణిక్ రెడ్డి సపోర్టింగ్ రోల్స్ చేశారు. వివేక్ సాగర్ సంగీత దర్శకుడు... కాగా త్వరలో రిలీజ్ కాబోతున్న ఈచిత్రం నుంచి తాజాగా ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios