Asianet News TeluguAsianet News Telugu

కమర్షియల్ దర్శకుడితో సూర్య ఆరవ సినిమా

సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ - హీరో కాంబినేషన్ కి క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో  స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా కోలీవుడ్ లో ఈ డోస్ ఎక్కువగానే ఉంటుంది. పఒక్కసారి సక్సెస్ అందుకుంటే చాలు వరుసగా వారిద్దరి కలయికలో సినిమాలు వేస్తూనే ఉంటాయి. కమర్షియల్ దర్శకుడు హరి కూడా సూర్యతో ఇప్పటికే 5 సినిమాలు చేశాడు. 

suriya 6th film with hari
Author
Hyderabad, First Published Aug 11, 2019, 4:59 PM IST

సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ - హీరో కాంబినేషన్ కి క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో  స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా కోలీవుడ్ లో ఈ డోస్ ఎక్కువగానే ఉంటుంది. పఒక్కసారి సక్సెస్ అందుకుంటే చాలు వరుసగా వారిద్దరి కలయికలో సినిమాలు వేస్తూనే ఉంటాయి. కమర్షియల్ దర్శకుడు హరి కూడా సూర్యతో ఇప్పటికే 5 సినిమాలు చేశాడు. 

ఆరు, వెల్, సింగం 1,2 సినిమాలు బాక్స్ ఆఫీస్ హిట్స్ లో చేరగా సింగం 3 మాత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఆరవసారి వీరి కలయికలో మరో సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల NGK సినిమాతో ప్లాప్ అందుకున్న సూర్య ప్రస్తుతం కెవి.ఆనంద్ డైరెక్షన్ లో కాప్పాన్ అనే ఒక సినిమా చేస్తున్నాడు. 

అలాగే సుధా కొంగర డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా హరి చెప్పిన ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కథ సూర్యకి నచ్చడంతో వెంటనే ఒప్పేసుకున్నాడట. అంతే కాకుండా ఆ సినిమాను సొంత బ్యానర్ లోనే నిర్మించాలని సూర్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు డైరెక్టర్ హరి హిట్ చూసి చాలా కాలమవుతోంది. చివరగా విక్రమ్ తో తీసిన స్వామి 2 కూడా ప్లాప్ అయ్యింది. మరి చాలా కాలం తరువాత సూర్యతో చేసే ప్రాజెక్ట్ ఈ దర్శకుడికి ఎలాంటి సక్సెస్ ని ఇస్తుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios