నేను పక్కాగా చెప్పగలను కౌశల్ ఫైనల్స్ వరకు వెళ్తాడని. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు సపోర్ట్ కూడా బాగుంది. నేను బయటకి వచ్చే సమయంలో నాకు అర్ధమైంది హౌస్ మేట్స్ లో అతడికి మంచి సపోర్ట్ ఉందని. మీకు అన్యాయం జరిగిందని హౌస్ లో ఉన్న ఆడవాళ్లతో అంటే మాకేం జరగలేదు అన్నట్లుగా మాట్లాడారు

బిగ్ బాస్ హౌస్ లో దాదాపు అరవై రోజుల పాటు తన ప్రయాణాన్ని కొనసాగించి గత వారం బయటకి వచ్చేశాడు బాబు గోగినేని. బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తరువాత బాబు గోగినేని ఈ షోపై అలానే హౌస్ మేట్స్ మీద కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. హౌస్ లో ఉన్నప్పుడు బాబు గోగినేని.. కౌశల్ ని టార్గెట్ చేశారు. అతడిని హౌస్ నుండి పంపించేయాలని కూడా అనుకున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయితే తాను కౌశల్ ని టార్గెట్ చేయలేదని నిరసన తెలిపానని బాబు గోగినేని అన్నారు. ఇక బిగ్ బాస్ టైటిల్ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారనే ప్రశ్నకు జవాబుగా.. 'నేను పక్కాగా చెప్పగలను కౌశల్ ఫైనల్స్ వరకు వెళ్తాడని. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు సపోర్ట్ కూడా బాగుంది. నేను బయటకి వచ్చే సమయంలో నాకు అర్ధమైంది హౌస్ మేట్స్ లో అతడికి మంచి సపోర్ట్ ఉందని.

మీకు అన్యాయం జరిగిందని హౌస్ లో ఉన్న ఆడవాళ్లతో అంటే మాకేం జరగలేదు అన్నట్లుగా మాట్లాడారు. కౌశల్ ని వారు సపోర్ట్ చేస్తున్నారనేదానికి ఇదొక ఉదాహరణ. ప్రజల్లో కూడా ఆయనకు సపోర్ట్ ఉందని ఓట్ల ద్వారా తెలుస్తోంది. ఆయన్ను గెలవనివ్వండి. ఎవరో ఒకరు గెలవాలి కదా' అంటూ వెల్లడించారు.