సూపర్ స్టార్ రజినీకాంత్ కు సైబర్ నేరగాళ్లు షాక్ ఇచ్చారు. ఓటీటీలోకి రాకముందే.. జైలర్ మూవీ ఆన్ లైన్ లో ప్రత్యక్షం అవవడంతో మూవీ టీమ్ షాక్ లో ఉన్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో ..రమ్య కృష్ణ ఆయన భార్యగా నటించిన పాన్ ఇండియా చిత్రం జైలర్ . నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఆగస్టు 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే 600 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. తమన్నా అద్భుతమైన సాంగ్ తో పాటు.. ఓ గ్లామర్ రోల్ లో ఆకట్టుకుంది. వీరితో పాటు మలయాళ స్టార్ హీరో మోహన్ లలాల్, కన్నడ స్టార్ శివన్న, బాలీవుడ్ హీరో జాకీష్రాఫ్ గెస్ట్ రోల్ చేసిన ఈసినిమాలో.. తెలుగు నుంచి సునీన్ సందడి చేశాడు. మరికొంత మంది స్టార్ సీనియర్ నటీనటులు ఈసినిమాలో కనిపించి మురిపించారు.
అన్ని భాషల్లో ఈమూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకుంది. తమిళంలో తిరుగులేని విజయం సొంతం చేసుకున్న ఈసినిమా తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా దుమ్మురేపింది. సౌత్ లో బ్లాక్బస్టర్ హిట్ సాధించింది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమాను చూడటానికి రజినీ ఫ్యాన్స్ జపాన్ నుంచి చెన్నై వచ్చారంటే.. ఈమూవీ క్రేజ్ అర్ధం అవుతోంది. సుభాస్కరన్ జైలర్ ను నిర్మించగా... ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.
ఇక ఈమూవీ సెప్టెంబర్ 7న సన్ నెక్ట్స్ ఓటీటీ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ అవ్వాల్సి ఉంది. అయితే ఈ లోపే సైబర్ నేరగాళ్ళు మూవీ టీమ్ కు పెద్ద షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఉన్నటుండి ఈ సినిమా ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. కొన్ని పైరసీ వెబ్ సైట్స్ లో జైలర్ మూవీ హెచ్డీ ప్రింట్ అప్లోడ్ చేసాయి. అది కూడా ఎలాంటి వాటర్ మార్క్స్ లేకుండా ఒరిజినల్ 5.1 సౌండ్ తో హై క్వాలిటీ ప్రింట్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
'జైలర్' సినిమా లీక్ అవ్వడంతో మూవీ టీమ్, థియేటర్లు, ఓటీటీ టీమ్ కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కచ్చితంగా మరికొన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు HD క్వాలిటీతో సినిమా ఆన్ లైన్ లో అందుబాటులో ఉండటంతో వసూళ్లపై ప్రభావం పడుతుంది. మరోవైపు ఈ మూవీ హిందీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ దాదాపు 100 కోట్లకు దక్కించుకున్నట్లు టాక్ ఉంది. పైరసీ సైట్స్ లో లీకైన కారణంగా ఓటీటీకి కూడా ఎంతో కొంత డ్యామేజీ జరుగుతుంది. మరి దీనిపై మేకర్స్ చర్యలు తీసుకుంటారేమో చూడాలి.ఏదేమైనా జైలర్ సినిమా డిజిటల్ రిలీజ్ కు ముందే ఆన్ లైన్ లో ప్రత్యక్షం అవ్వడం రజినీకాంత్ కు షాక్ అనే చెప్పాలి.