Asianet News TeluguAsianet News Telugu

ఫ్యాన్స్ కి మహేష్ వినాయక చవితి శుభాకాంక్షలు..!

సూపర్ స్టార్ మహేష్ తన అభిమానులకు ట్విట్టర్ వేదికగా వినాయక చవితి శుభాకాంక్షలు  చెప్పారు. చవితికి ఇంటికి వచ్చిన గణనాథుడు ప్రజలకు మంచి చేయాలని, తెలివితేటలు, జ్ఞానం ప్రసాదించాలని కోరుకున్నారు. 
 

superstar mahesh wishes a happy ganesh chaturthi fans feeling crazy on his tweet
Author
Hyderabad, First Published Sep 10, 2021, 4:45 PM IST

దేశవ్యాప్తంగా గణనాథుడు గణేష్ చతుర్థి పండుగను భక్తులు ఘనంగా జరుపుకుంటున్నారు. హిందూ సాంప్రదాయ పండుగులలో ప్రాధాన్యత కలిగిన వేడుకను నిష్టగా నిర్వహిస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ తన అభిమానులకు ట్విట్టర్ వేదికగా వినాయక చవితి శుభాకాంక్షలు  చెప్పారు. చవితికి ఇంటికి వచ్చిన గణనాథుడు ప్రజలకు మంచి చేయాలని, తెలివితేటలు, జ్ఞానం ప్రసాదించాలని కోరుకున్నారు. 


తన లిటిల్ ప్రిన్సెస్ సితార వినాయక పూజకు సంబంధించిన ఫోటోను మహేష్ షేర్ చేయడం విశేషం. సితార తమ ఇంటిలోని పూజ గదిలో కూర్చొని నవ్వుతూ ఫోటోకి పోజులిచ్చారు. ఇక మహేష్ ట్వీట్ ని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. మిగతా స్టార్స్ తో పోల్చితే మహేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. సామాజిక విషయాలతో పాటు వ్యక్తిగత, సినిమాలకు సంబంధించిన అనేక విషయాలపై స్పందిస్తూ ఉంటారు. 

మరోవైపు మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నట్లు సమాచారం. 2022 జనవరిలో సంక్రాంతి కానుకగా సర్కారు వారి పాట విడుదల కానుంది. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios