గెట్ రెడీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ... రీ రిలీజ్ కు రెడీగా రజినీకాంత్ శివాజీ మూవి.

సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. తలైవా అభిమానులు దిల్ ఖుష్ అయ్యే వార్త  ఒకటి వైరల్ అవుతోంది. ప్రస్తుతం ట్రెండ్ ను ఫాలో అవుతూ.. ఫ్యాన్స్ కు అద్భుతమైన ట్రీట్ ను రెడీ చేస్తున్నారట మేకర్స్. 
 

Super Star Rajinikanth shankar Shivaji Movie Re release Date JMS


ప్రస్తుతం టాలీవుడ్  ఫిల్మ్ ఇండస్ట్రీలో  రీ రిలీజ్ ల ట్రెండ్ జోరుగా సాగుతోంది. స్టార్ హీరోల సినిమాలను ఆయా అకేషన్లను బట్టి రీరిలీజ్ కు ముస్తాబు చేస్తున్నారు మేకర్స్. స్టార్ హీరోల కెరీర్ లో నిలిచిపోయిన సినిమాలు.. హిట్ అయినా.. ప్లాన్ అయినా సరే అభిమానులు మర్చిపోలేని సినిమాలను ఏరి కోరి రీరిలీజ్ చేస్తుంటారు.  ఇలా హీరోలు పుట్టినరోజు సందర్భంగా వారి కెరియర్లో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటు వంటి సినిమాలను తిరిగి 4కె వెర్షన్లు విడుదల చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇప్పటికీ టాలీవుడ్  స్టార్ హీరోల సినిమాలు చాలా వరకూ రీరిలీజ్ ట్రెండ్ ను ఫాలో అయ్యి..సక్సెస్ అయ్యాయి. మేకర్స్ కు మరోసారి లాభాలు తెచ్చిపెట్టాయి. ఇక కోలీవుడ్ హీరోల సినిమాలను కూడా టాలీవుడ్ లో రీరిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. 


ఇప్పటికే ఆ ఫార్ములా అప్లే చేసి...కోలీవుడ్ స్టార్ సీనియరన్ హీరో సూర్య నటించిన తెలుగువెర్షన్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు తిరిగి తిసుకువచ్చారు.  తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల వంతు వచ్చింది. తలైవా నటించిన సూపర్ హిట్ సినిమా  శివాజీ. ఈ  సినిమాని కూడా తిరిగి విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 2007లో వచ్చిన శివాజీ సినిమాకు  శంకర్ దర్శకత్వం వహించారు. రజనీకాంత్ శ్రియ హీరో హీరోయిన్లుగా నటించిన ఈసినిమాలో  రజనీకాంత్ రెండు డిఫరెంట్  గెటప్స్ లో నటించి సందడి చేశారు. ఇక ఈ సినిమాలో సుమన్ విలన్ పాత్రలో నటించారు.

అప్పట్లోనే దాదాపు 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినటువంటి ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు భాషలలోనూ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని సుమారు 160 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రజనీకాంత్ సినీ కెరియర్ లో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిపోయింది. ఇక ఈ సినిమా త్వరలోనే రీ రిలీజ్ చేయబోతున్నారని తెలిసి.. మూవీపూ అంచనాలు భారీగా పెరిగాయాయి. 4కెలో ఈ సినిమాను చూడటానికి ఆడియన్స్ ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.  ఈ ఏడాది డిసెంబర్ 12న సూపర్ స్టార్ బర్త్ డే కావడంతో.. ఆ అకేషన్ ను సెలబ్రేట్ చేస్తూ..  మూవీని రిలీజ్ చేయాలని చూస్తున్నారు టీమ్. 

రజనీకాంత్  బర్త్ డే డిసెంబర్ 12 న కాగా.. దానికి మూడు రోజులు ముందుగానే శివాజీ రీ రిలీజ్ ఉండే అవకాశం ఉంది. రీరిలీజ్ తరువాత కూడా ఈమూవీ భారీగా కలెక్ట్ చేస్తుందన్ననమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఎందుకుంటే యావరేజ్ టాక్ తోనే భారీ కలెక్షన్స్ సాధించింది సినిమా.. రీరిలీజ్ తో ఎన్ని రికార్డ్ లు బ్రేక్ చేస్తుందో చూడాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios